చినుకుపడితే ప్రకృతి పరవశించి పొదరిల్లుగా అల్లుకున్న ప్రాంతాలు ఇవే.. ఈ సీజన్‎లో చూసి తీరాల్సిందే..

వర్షాకాలంలో ప్రకృతికి కొత్త జీవితం ప్రారంభమవుతుంది. చెట్లు, నెల పచ్చని తొరణాలను కప్పుకున్నట్లుగా కనిపిస్తుంటాయి. మన ఇండియాలో ఉండే అనేక ప్రాంతాలు ఈ వర్షాకాలంలో మరింత అందంగా కనిపిస్తుంటాయి. ఈ అందమైన ప్రాంతాలను చూడటానికి పర్యాటకులు కూడా ఎక్కువగానే వస్తుంటారు. అవెంటో తెలుసుకుందామా.

| Edited By: Rajitha Chanti

Updated on: Jul 14, 2021 | 9:53 PM

మేఘాలయలోని చిరపుంజీ ప్రాంతం ఈ వర్షాకాలంలో పూర్తిగా ఆకుపచ్చని రంగులోకి మారినట్లుగా కనిపిస్తుంది. ఇక్కడ ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. పక్షులు, కీటకాలు చేసే హమ్మింగ్ శబ్ధాలతోపాటు.. లోయలో ప్రవహించే నదుల శబ్ధాలు పర్యాటకులకు ఎంతో అద్భుతమైన అనుభూతినిస్తాయి.

1 / 6
 కర్ణాటకలోని చిక్మగళూరు ప్రాంతంలో వర్షాకాలం మ్యాజిక్ జరుగుతుందని చెప్పుకోవచ్చు. పశ్చిమ కనుమల ఒడిలో కూర్చుని అందమైన ప్రకృతిని ఆస్వాదించవచ్చు. ఇక్కడి సమీపంలోని చార్మాడి ఘాట్‏కు డ్రైవ్ చేయవచ్చు. అలాగే పశ్చిమ కనుమల నుంచి అనేక జలపాతాల అందాలను చూడవచ్చు. వర్షాకాలంలో ఈ ప్రాంతాన్ని చూడడం వలన మీరు జీవితంలో మర్చిపోలేని అనుభూతిని పొందుతారు.

2 / 6
మహారాష్ట్రలోని భండార్ధర ప్రాంతం పూర్తిగా జలపాతాల ఆవాసం అనుకోవచ్చు. ఇక్కడి రుండా జలపాతం, సరస్సులు అనేకం పర్యాటకులను ఆకర్శిస్తాయి. భండార్దర పశ్చిమ కనుమల సహ్యాద్రి పర్వతాలలో ఉంది. ఇది మహారాష్ట్ర చుట్టుపక్కల హైకర్లు,  ట్రెక్కింగ్ చేసేవారికి స్వర్గధామంగా ఉంటుంది.

3 / 6
 ఉత్తరాఖండ్‏లోని ముస్సూరీ ఎప్పుడూ లేని విధంగా ఈ వర్షాకాలంలో పూర్తిగా ఆకుపచ్చగా మారిపోతుంది. కొండలపై పచ్చని బైళ్లు.. వాటి మధ్య నుంచి జారే నీటి అద్భుతమైన ప్రాంతాన్ని చూడవచ్చు. వర్షాకాలంలో ఇక్కడికి పర్యాటకులు అనేక మంది వస్తుంటారు.

4 / 6
రాజస్థాన్‏లోని బన్స్వారా ప్రాంతాన్ని సిటీ ఆఫ్ హండ్రెడ్ ఐలాండ్స్ అని పిలుస్తుంటారు. ఈ ప్రదేశంలో ఔషదాలు, వెదురు చెట్లు అనేకం ఉంటాయి. పచ్చని కొండలు, సరస్సులు, నదులు వంటి ప్రదేశాలు పర్యాటకులకు కనుల విందుగా కనిపిస్తాయి.

5 / 6
చినుకుపడితే ప్రకృతి పరవశించి పొదరిల్లుగా అల్లుకున్న ప్రాంతాలు

6 / 6
Follow us