- Telugu News Photo Gallery World photos The inspirational story of how a single mum has toured the world carrying her disabled son on her back
Inspiring Story: అమ్మ వీపే ఆ దివ్యాంగుడి ఆవాసం.. 26 ఏళ్ల కొడుకుని అన్నీ తానై సాకుతున్న తల్లి
Inspiring Story: సృష్టిలో తియ్యని అమ్మ ప్రేమ.. అమ్మప్రేమలోని కమ్మదనం అనుభవించడం కోసం అవతార పురుషుడు కూడా మనవ జన్మ ఎత్తాడని అంటారు. ఒక తల్లి వందమంది పిల్లలను పెంచుతుంది.. ఒక తల్లిని వండమని పిల్లలు పెంచలేరు.. ఇది నానుడి అయినా.. తల్లి ప్రేమను తెలియజేసే ఒక గొప్ప వ్యాక్యం.. అయితే ఆధునిక కాలంలో అన్ని మారిపోయినట్లే.. అమ్మప్రేమలో కూడా మార్పులు వచ్చాయి.
Updated on: Jan 06, 2022 | 5:37 PM

అప్పుడే పుట్టిన కళ్ళు తెరవని పసి గుడ్డుని సైతం రోడ్డుపాలు చేసే కొందరు తల్లులు ఉన్నారు.. తనకు పుట్టిన బిడ్డ వికలాంగుడైన భర్త అండ లేకుండా.. అన్నీ తానై పెంచే అమృతం వంటి మాతృ హృదయం కల తల్లులు ఉన్నారు. ఎందుకంటే నవమాసాలు మోసి.. కన్న బిడ్డ ఎప్పుటికీ తల్లికి బరువు కాదుకదా.. అందుకే కడుపున పుట్టిన బిడ్డకు కళ్ళు లేవు.. మూర్ఛ సరైన ఎదుగుదల లేదు.. అయినప్పటికీ అంతా తానై పెంచుతుంది.. తన వీపు మోస్తూ.. తన కళ్ళతో తనయుడికి లోకాన్ని చూపిస్తుంది.. ప్రస్తుతం ఈ తల్లికొడుకులకు చెందిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నెటిజన్ల హృదయాలను కదిలిస్తూ.. కంట నీరు పెట్టిస్తున్నాయి.

ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ సన్‌షైన్ కోస్ట్‌కు చెందిన నిక్కి ఆంత్రమ్ (43)కు 17 ఏళ్ల వయసులో మగ బిడ్డ పుట్టాడు.అయితే జిమ్మీ అంధత్వంతో సహా శారీరక,మానసిక వైకల్యాలతో జన్మించాడు.

జిమ్మీకి రెండు నెలల వయస్సు ఉన్నప్పుడు.. అతను అంధుడని మొదటిగా జిమ్మీ అమ్మమ్మ గుర్తించింది. అంతేకాదు ఆరునెలల వయసులో జిమ్మీకి మూర్ఛరోగం ఉన్నట్లు కూడా ఆంత్రమ్ తెలుసుకుంది.

మొదట నిక్కీ ఆంత్రమ్ తన బిడ్డ పరిస్థితికి కుమిలిపోయింది. తర్వాత తన కళ్ళతో బిడ్డకు లోకాన్ని చూపాలని నిర్ణయించుకుంది. 24 గంటలు కొడకు జిమ్మీ వెన్నంటే ఉండి ఏ కష్టం తెలియకుండా పెంచసాగింది. వికలాంగుడైన తన కుమారుడికి తల్లిగా తాను ఇవ్వగలిగినంత ఉత్తమ జీవితాన్ని ఇస్తానని 17 ఏళ్లప్పుడు తనకు తానుగా ప్రమాణం చేసుకుంది. అది నెరవేర్చడానికి ఆంత్రమ్.. జిమ్మీని తన వీపుపై ఎత్తుకుని ప్రపంచవ్యాప్తంగా ప్రయాణించింది.

ఇప్పుడు జిమ్మీకి 26 ఏళ్లు. ఐతే వరల్డ్ టూర్‌కు వెళ్లాలనుకున్న నిక్కి తన కొడుకును కూడా తనతోపాటే తీసుకెళ్లాలనుకుంది. వీపుపై జిమ్మీని మోస్తూ హవాయి నుంచి బాలి వరకు అనేక ప్రదేశాలకు జిమ్మీని తీసుకుని వెళ్ళింది. కరోనా వెలుగులోకి రాక ముందు తల్లి కొడుకులు ఇద్దరూ కెనడాను సందర్శించానలనుకున్నారు. కరోనా ఆంక్షలు మొదలు అవ్వడంతో వీరి టూర్ కి బ్రేక్ పడింది.

జిమ్మీని తనతో పాటు తీసుకుని వెళ్లే సమయంలో డైపర్లు, బట్టలు, బెడ్ ప్యాడ్స్, దుప్పట్లు, దిండులు వంటివి తీసుకుని వెళ్తానని చెప్పింది నిక్కీ . అంతేకాదు జిమ్మీని వీపుపై మోయడం ప్రాక్టీస్ చేశాను కూడా. ఇక మరిన్ని ప్రదేశాలను మేమిద్దరం సందర్శిస్తామని నిక్కీ చెబుతోంది.

'నేను జిమ్మీని చూస్తున్నాను... తను ఎప్పుడూ సంతోషంగా, నవ్వుతూ ఉంటాడు. అయితే నన్ను జిమ్మీ కళ్ళతో తో చూడలేడు.. కానీ తన మనసుకి తల్లి ఎలా ఉఁటుందో ఖచ్చితంగా తెలుసు అంటూ కొడుకు గురించి ఎంతో సంతోషంగా చెబుతోంది ఈ 43 ఏళ్ల అమ్మ.




