- Telugu News Photo Gallery World photos Nasas perseverance mission produced oxygen on mars photo story
Mars : నాసా ప్రవేశపెట్టిన మార్స్ రోవర్ పెర్సెవరెన్స్ మరో అద్భుతం సృష్టించింది.. అంగారకుడిపై ఆక్సిజన్ తయారు చేసింది.!
NASA Perseverance mission : అరుణగ్రహంపై జీవజాలం జాడను కనుగొనేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రవేశపెట్టిన మార్స్ రోవర్ పెర్సెవరెన్స్..
Updated on: Apr 23, 2021 | 10:54 PM

ఇప్పటికే విలువైన సమాచారాన్ని భూమికి పంపుతోన్న రోవర్.. తాజాగా అరుణ గ్రహంపై ఆక్సిజన్‌ను తయారు చేసింది. మార్స్ మీద కొంత కార్బన్-డై-ఆక్సైడ్‌ను సేకరించిన పెర్సెవరెన్స్.. దాని నుంచి ప్రాణవాయువును ఉత్పత్తి చేసినట్టు నాసా వెల్లడించింది.

రోవర్ ముందుభాగం కుడి వైపున కారు బ్యాటరీ పరిమాణంలో మెకానికల్ ట్రీ పసిడి పెట్టె ఉంది. ఇది కార్బన్-డై-ఆక్సైడ్‌ను తీసుకుని, విద్యుత్తు, రసాయనాల సాయంతో దాన్ని విడగొట్టింది. తద్వారా 5 గ్రాముల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసింది

ఒక వ్యోమగామి పది నిమిషాల పాటు శ్వాసించడానికి ఈ ఆక్సిజన్ సరిపోతుంది. ఈ మార్స్ ఆక్సిజన్ సదరు పసిడి పెట్టెలోనే నిక్షిప్తమై ఉంది. గంటకు 10 గ్రాముల మేర ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో ఇంజినీర్లు ఈ మెకానికల్ ట్రీను రూపొందించారు.

భవిష్యత్తులో మార్స్ మీదకి వెళ్లే వ్యోమగాములకు ఆక్సిజన్ కొరత ఉండదు. తిరుగు ప్రయాణం కోసం భూమి నుంచి పనిగట్టుకుని అంగారకుడిపైకి రాకెట్ ప్రొపెల్లంట్‌ను తీసుకెళ్లాల్సిన అవసరం తప్పుతుందని నాసా స్పేస్ టెక్నాలజీ మిషన్ అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ జిమ్ రాయిటర్ చెప్పారు.