- Telugu News Photo Gallery World photos Giethroon village in netherlands without roads in only travel by boat in canal
పెట్రోల్ బాధలేదు.. ఆ ఊర్లో కాలువలే రోడ్లు.. ఇంటింటికో పడవ.. ఎక్కడంటే.!
ప్రస్తుతం బైక్ బయటకు తీయాలంటే గుండెల్లో గుబులు పుడుతుంది. రోజు రోజుకీ పెరుగుతున్న పెట్రోల్ ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. అయితే ఓ గ్రామంలో మాత్రం పెట్రోల్ బాధ అసలే లేదు. ఎక్కడికైనా పడవలోనే వెళ్తారు.
Updated on: Jul 09, 2021 | 1:59 PM

నెదర్లాండ్స్‌లోని ఓవర్జెస్సెల్ ప్రావిన్స్‌లో ఉన్న గిథోర్న్ గ్రామం. అందమైన ప్రకృతితో కూడిన నగరంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఊర్లో అసలు వాహానాలు లేవు. ఎందుకంటే ఇక్కడ రహదారులు లేవు. వాళ్లు ప్రయాణానికి నాలుగు మైళ్ల విస్తీర్ణంలో ఉన్న కాలువలను ఉపయోగిస్తారు.

ఈ గ్రామం అందమైన సరస్సులు, పువ్వులు, చెక్క వంతెనలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ రోడ్లు లేవు. నెదర్లాండ్ లోని ఈ గ్రామం చుట్టూ తిరగడానికి స్థానికులు పడవలను ఉపయోగిస్తారు. అక్కడి శివార్లలో కార్లు పార్క్ చేయాలి.

గిథోర్న్ వెరిబెన్-వైడెన్ నేషనల్ పార్క్ సమీపంలో ఉంది. ఇది ప్రకృతి రిజర్వ్. ప్రాన్సిస్కాన్ సన్యాసులు మొదట 13వ శతాబ్ధంలో ఇక్కడ స్థిరపడ్డారు. ఈ గ్రామంలో కదలిక కోసం కాలువలు తవ్వారు. ఈ గ్రామంలో 180కి పైగా వంతెనలు ఉన్నాయి. దీనిద్వారా ప్రజలు కాలువను దాటుతారు.

ఈ గ్రామంలో సుమారు 3000 మంది నివసిస్తున్నారు. రోడ్లు లేని గిథోర్న్ గ్రామం పగటి పూట నిశ్శబ్ధంగా ఉంటుంది. ఇక్కడ నివసించే ప్రజలకు సొంతంగా ద్వీపాలు ఉన్నాయి. అలాగే వారు కాలువల ద్వారా ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్తారు. ఇంటింటికి సొంతంగా పడవ ఉంది.

ఈ గ్రామాన్ని "వెనిస్ ఆఫ్ ది నార్త్ " అని పిలుస్తారు. రోడ్లు లేని గ్రామంగా ఈ ప్రాంతం ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. ఇక్కడికి వెళితే ఒక అద్భుతమైన ప్రదేశంగా అనిపిస్తుంది.

గిథోర్న్ నగరం ఆమ్స్టర్డామ్కు ఈశాన్యంగా 55 మైళ్ల దూరంలో ఉంది. కాలువలను దాటి 180 వంతెనలు ఉన్నాయి. వాటి ద్వారా నగరం మొత్తం ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉన్నాయి. ఈ వంతెనలే చాలా ఇళ్లను చేరుకోవడానికి ఏకైక మార్గం. దాదాపు అన్ని పూర్తిగా చెక్కతో చేయబడినవే.




