The Fort Blunder: శత్రుదేశ భూభాగంలో కోట కట్టి.. నాలిక్కరుచుకుని ఆ కోటను దానికే వదిలేసిన దేశం ఒకటుంది తెలుసా?
తమ దేశంలోకి పక్క దేశం వాళ్ళు రాకూడదని కోట కట్టడం ప్రారంభించింది ఓ దేశం. దాదాపు నిర్మాణం పూర్తయ్యాకా ఆభూభాగం శత్రువుది అని తెలుసుకుంది. ఇంతకీ ఆ దేశం ఏమిటో.. ఆ కోట ఏమిటో తెలుసుకుని చూద్దాం రండి..
అమెరికా ఇలా అనుకోకుండా తమ శత్రువుల భూభాగంలోనే కోటను కట్టి, చివరికి దాన్ని వారికే ఇచ్చివేయడంతో ఈ కోటకు ‘ఫోర్ట్ బ్లండర్’ అని పేరు పడింది.
Follow us
శత్రువులు తమ దేశంలోకి రాకుండా ఎవరైనా కోట కడతారు. కానీ, శత్రుదేశంలోనే కోట కట్టిన ఘనత కలిగిన దేశం ఎదో తెలుసా.. అమెరికా!
బ్రిటిష్ పాలన నుంచి అమెరికా విముక్తి పొందినా కెనడా మాత్రం బ్రిటన్ ఆధీనంలోనే ఉంది. దాంతో కెనడా నుంచి ఎవరూ రాకుండా అమెరికా కోట కట్టింది
అయితే, ఆ కోట తమ భూభాగంలో కాకుండా ఈశాన్యాన క్లింటన్ కౌంటీలోని న్యూయార్క్‌కు ఆనుకొని ఉన్న చాంప్లాన్ సరస్సు వద్ద కట్టడం ప్రారంభించింది
కోట దాదాపు పూర్తవుతుందనగా ఆ ప్రదేశం తమ భూభాగంలో లేనట్లు అమెరికా గుర్తించి నాలుక్కరుచుకుంది. అక్కడ నుంచి సామాను తీసుకుని పోయింది.
అమెరికా ఇలా అనుకోకుండా తమ శత్రువుల భూభాగంలోనే కోటను కట్టి, చివరికి దాన్ని వారికే ఇచ్చివేయడంతో ఈ కోటకు ‘ఫోర్ట్ బ్లండర్’ అని పేరు పడింది.