Beetroot Juice: వావ్.. ఆడవారి ఆరోగ్యానికి బీట్‌రూట్.. రోజూ ఇలా వాడితే శరీరంలో కలిగే మార్పులు ఇవే.!
బీట్‌రూట్ ప్రకృతి సహజంగా పోషకాలతో నిండిన కూరగాయ. దీనిని జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక రకాల ప్రయోజనాలను అందిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.. బీట్‌రూట్‌లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా మహిళలు రోజూ ఒక కప్పు బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా అనేక సమస్యలను నయం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Updated on: Dec 31, 2024 | 5:18 PM

Beetroot

నివేదికల ప్రకారం,.. బీట్‌రూట్‌ను అధికంగా తీసుకోవడం వల్ల కాలేయంలో లోహ అయాన్‌లు పేరుకుపోతాయి. ఇది దీర్ఘకాలంలో కాలేయాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. బీట్‌రూట్ జ్యూస్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కాల్షియం స్థాయిలు తగ్గుతాయి. తక్కువ కాల్షియం స్థాయిలు ఉన్న మహిళలు బీట్‌రూట్ జ్యూస్‌ను ఎక్కువగా తీసుకోకూడదని చెబుతున్నారు.

బీట్‌రూట్‌లో నైట్రేట్‌లు ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకుంటే పొత్తికడుపులో తిమ్మిర్లు వస్తాయి. అలాగే, మహిళలకు గర్భధారణ సమయంలో బీట్‌రూట్ జ్యూస్ అంత సురక్షితం కాదని అంటున్నారు. ఇందులో ఎక్కువ నైట్రేట్ తీసుకునే గర్భిణీ స్త్రీలకు శక్తి లోపించడం, తలనొప్పి, కళ్లు తిరగడం, కళ్లు, నోరు, పెదవులు, చేతులు, కాళ్ల చుట్టూ నీలి-బూడిద చర్మం ఏర్పడే అవకాశం ఉంటుంది.

బీట్ రూట్ జ్యూస్ తీసుకోవడం వల్ల లివర్ పై కొవ్వు పేరుకు పోకుండా నివారిస్తుంది. ఇందులోని పోటాషియం అధికంగా ఉంటుంది దీని వల్ల నరాలు, కండరాల సమస్యలను తగ్గించడానికి సహాయ పడుతుంది. చర్మ రక్షణలో కూడా ఏంతో దోహదపడుతుంది. బీట్‌రూట్ జ్యూస్‌లో ఉండే ఫ్రీరాడికల్స్, బ్యాక్టీరియా, యాంటీ ఆక్సిడెంట్లు హానికరమైన బ్యాక్టీరియా నుంచి రక్షిస్తుంది.

క్యారెట్, బీట్‌రూట్‌లో పోషక కణాలు ఉంటాయి. క్యారెట్‌లలో ప్రధానంగా యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. ఇది మొత్తం ఆరోగ్యానికి మంచిది. మరోవైపు, బీట్‌రూట్‌లలో మాంగనీస్, పొటాషియం, విటమిన్ సితో పాటు ఫోలేట్ అధికంగా ఉంటుంది. రెండు కూరగాయలు తక్కువ కేలరీలను కలిగి ఉంటాయి. అయితే వీటిని జ్యూస్‌గా కన్నా నేరుగా తీసుకోవడం మంచిది.




