నీళ్లలో తులసి ఆకులు, 2 మిరియాలు వేసి బాగా మరిగించి.. వేడిగా ఓ కప్పు తాగారంటే?
శీతాకాలంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. శీతాకాలంలో జలుబు వంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఈ కాలంలో ఆరోగ్యంగా ఉండాలనుకుంటే మీ రోజువారీ ఆహారంలో మిరియాలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా శీతాకాలంలో జలుబు, దగ్గు, జ్వరం వంటి ఆరోగ్య సమస్యలు రావడం సర్వసాధారణం..
Updated on: Nov 16, 2025 | 12:41 PM

శీతాకాలంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. శీతాకాలంలో జలుబు వంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఈ కాలంలో ఆరోగ్యంగా ఉండాలనుకుంటే మీ రోజువారీ ఆహారంలో మిరియాలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ముఖ్యంగా శీతాకాలంలో జలుబు, దగ్గు, జ్వరం వంటి ఆరోగ్య సమస్యలు రావడం సర్వసాధారణం. ఈ సమయంలో ఆరోగ్యంగా ఉండటం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

శీతాకాలంలో అతి పెద్ద సమస్య గొంతు నొప్పి. గొంతు నొప్పితో గొంతు బొంగురు పోయినట్లు అనిస్తుంది. దీనివల్ల భోజనం తినడం కూడా కష్టమవుతుంది. దీనికి పరిష్కారంగా కోసం చాలా మంది వేడి నీళ్లు తాగుతుంటారు.

వేడి నీటిని తాగే బదులు ఈ ప్రత్యేక పానియం తాగవచ్చు. దీన్ని తీసుకోవడం వల్ల గొంతు బొంగురుపోవడం సమస్య నుంచి బయటపడటానికి సహాయపడుతుంది. ఈ పానియం తయారు చేయడానికి ఐదు తులసి ఆకులు, రెండు నల్ల మిరియాలు, ఒక చిన్న అల్లం ముక్కను నీటిలో వేసి బాగా మరిగించాలి. తర్వాత వడకట్టి చల్లబరిచి ఈ నీటిని తాగాలి.

శీతాకాలంలో దీన్ని ప్రతిరోజూ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. మిరియాలు అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది.




