పండ్లు ఎప్పుడు తినాలో, ఎప్పుడు తినకూడదో తెలుసుకోండి.. లేదంటే మీకే నష్టం!
ఆరోగ్యకరమైన ఆహారం గురించి ఆలోచించినప్పుడు ముందుగా గుర్తుకు వచ్చేది పండ్లు. పండ్లను తినడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటిలో ఉండే విటమిన్‌లు, కనిజాలు మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతాయి. అయితే పండ్లను తినడం ఎంత ముఖ్యమో వాటిని తినే సమయం కూడా అంతే ముఖ్యం అంటున్నారు నిపుణులు. పోషకాహార నిపుణురాలు సుమన్ అగర్వాల్ ప్రకారం.. పండ్లను తినే సమయాలు వాటి ప్రయోజనాలను నిర్ణయిస్తాయని చెబుతున్నారు.కాబట్టి పండ్లను ఏటైంలో తినాలి, ఏటైంలో తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
Updated on: Sep 23, 2025 | 8:30 PM

పండ్లు తినడానికి ఉత్తమ సమయాలు: పండ్లను భోజనాల సమయంలో స్నాక్స్‌గా తీసుకోవచ్చు. ఇలా తినడం వల్ల వాటి ప్రయోజనాలను పొందవచ్చు. భోజనంతో వాటిని తీసుకోవడం వల్ల అవి మీకు శక్తిని ఇస్తాయి. ఎక్కువ సమయం మీకు కడుపు నిండి ఉండటానికి సహాయపడతాయి.

పండ్లు తిన్న తర్వాత పెరుగు తినడం వల్ల వాంతులు లేదా కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా తలనొప్పి వంటి సమస్యలు కూడా వస్తుంటాయి.

భోజనం తర్వాత (డెజర్ట్‌గా) - పండ్లును భోజనం తర్వాత డెజర్ట్‌గా కూడా తీసుకోవచ్చు. అందుకే చాలా ఫంక్షన్, పార్టీలతో భోజనం తర్వాత డెజర్ట్‌లను ఏర్పాటు చేస్తారు. పండ్లు భోజనానికి తేలికైన, తీపి ముగింపుగా ఉంటాయి. అవి మీకు పోషకాలను అందించడమే కాకుండా ఆరోగ్యకరమైన రీతిలో మీ తీపి దంతాలను సంతృప్తిపరుస్తాయి.

పండ్లు తిన్న తర్వాత పెరుగుతోపాటు మజ్జిగ కూడా తీసుకోకూడదు. వీలైతే ఉదయం అల్పాహారంగా పండ్లు తినడానికి ప్రయత్నించాలి. ఇది రోజంతా ఉత్సాహంగా ఉండటానికి మీకు సహాయపడుతుంది.

పండ్లు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు అందించేవి అయినప్పటికీ వాటిని తినే సమయం వల్ల వాటి ప్రయోజనాలు అనేవి మారిపోతాయి. వాటిని మీ స్నాక్ బడ్డీగా, ప్రీ-వర్కౌట్ బూస్టర్‌గా లేదా భోజనం తర్వాత ట్రీట్‌గా తీసుకుంటే ఒకే.. కానీ ఉదయం ఖాళీ కడుపుతో వాటిని తినడం మానేయండి. .( పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా అందించబడినవి.. వీటిపై మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యులను సంప్రదించండి)




