హీరోయిన్‌గా కొత్త అందం.. సోషల్ మీడియా బ్యూటీకి ఫిదా అవుతున్న ప్రేక్షకులు
సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్నారు. కొంతమంది మాత్రం తమ యాక్టింగ్ స్కిల్స్, డాన్స్ లతో నెటిజన్స్ ను ఆకట్టుకుంటూ ఫెమస్ అవుతున్నారు. ఇక ఇదే క్రేజ్ తో ఇండస్ట్రీకి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. పలు టీవీ షోల్లో అవకాశాలు అందుకున్నారు కొందరు.
Updated on: Sep 23, 2025 | 9:55 PM

సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్నారు. కొంతమంది మాత్రం తమ యాక్టింగ్ స్కిల్స్, డాన్స్ లతో నెటిజన్స్ ను ఆకట్టుకుంటూ ఫెమస్ అవుతున్నారు. ఇక ఇదే క్రేజ్ తో ఇండస్ట్రీకి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. పలు టీవీ షోల్లో అవకాశాలు అందుకున్నారు కొందరు.

తాజాగా మరో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఇప్పుడు సినిమాల్లోకి అడుగు పెడుతుంది. ఆమె పేరు నిహారిక.. ఈమె గురించి చాలా మందికి తెలుసు. సినిమా వాళ్ళతో రకరకాల వీడియోలు చేసి క్రేజ్ సొంతం చేసుకుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చాలా మంది సెలబ్రిటీలతో ఆమె వీడియోలు చేసింది.

పైగా నిహారిక వీడియోలు చేసిన స్టార్స్ మామూలు వాళ్ళు కాదు.. మహేష్ బాబు, రాకింగ్ స్టార్ యష్, రణబీర్ కపూర్ ఇలా పెద్ద పెద్ద హీరోలతో మూవీ ప్రమోషన్స్ చేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. నిహారిక హీరోయిన్ గా త్వరలోనే ఓ సినిమారానుంది.

ఇప్పటికే తమిళ్ లో ఓ సినిమా చేసింది నిహారిక. ఇప్పుడు తెలుగులో నటిస్తుంది. మరి ఈ అమ్మడు హీరోయిన్ గా ఎలాంటి సక్సెస్ లు అందుకుంటుందో చూడాలి. సమంత, నయన తార, లక్ష్మీ మంచు, నాగ చైతన్య, తమన్నా, వర్ష బొల్లమ్మ ఇలా చాలా మంది నిహారికాను ఫాలో అవుతున్నారు. అంతే కాదు ఆమె పలు యాడ్స్ లోనూ నటించింది.

మిత్రమండలి చిత్రంతో టాలీవుడ్‌లోకి అరంగేట్రం చేస్తోంది. విజయేందర్ ఎస్ నూతన దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. బన్నీ వాసు తాను నూతనంగా ప్రారంభించిన బి.వి. వర్క్స్ పతాకంపై 'మిత్ర మండలి' చిత్రాన్ని సమర్పిస్తున్నారు.