Walking Tips: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రోజులో ఎంత దూరం నడవాలి?

ఫిట్‌గా ఉండాలంటే పోషకాహారం తీసుకోవడంతోపాటు తేలికపాటి వ్యాయామం కూడా చేయాలి. డైలీ ఎక్సర్‌సైజ్‌లలో నడకకు మించిన ప్రత్యామ్నాయం లేదనే విషయం అందరికీ తెలిసిందే. బ్లడ్ ప్రెజర్ కంట్రోల్‌లో ఉండాలన్నా, బ్లడ్ షుగర్ కంట్రోల్‌లో ఉండాలన్నా, బరువు తగ్గాలన్నా.. అన్ని సమస్యలకు పరిష్కారం ఈ నడకలోనే దాగి ఉంది. రోజుకి 10 వేల అడుగులు నడవడం ద్వారా గుండె జబ్బులు, మరణాల ప్రమాదాన్ని నివారించడం సాధ్యమవుతుందని బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్‌లో..

|

Updated on: Apr 17, 2024 | 1:11 PM

ఫిట్‌గా ఉండాలంటే పోషకాహారం తీసుకోవడంతోపాటు తేలికపాటి వ్యాయామం కూడా చేయాలి. డైలీ ఎక్సర్‌సైజ్‌లలో నడకకు మించిన ప్రత్యామ్నాయం లేదనే విషయం అందరికీ తెలిసిందే. బ్లడ్ ప్రెజర్ కంట్రోల్‌లో ఉండాలన్నా,  బ్లడ్ షుగర్ కంట్రోల్‌లో ఉండాలన్నా, బరువు తగ్గాలన్నా.. అన్ని సమస్యలకు పరిష్కారం ఈ నడకలోనే దాగి ఉంది.

1 / 5
రోజుకి 10 వేల అడుగులు నడవడం ద్వారా గుండె జబ్బులు, మరణాల ప్రమాదాన్ని నివారించడం సాధ్యమవుతుందని బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్‌లో ప్రచురించబడిన ఓ అధ్యయనం వెల్లడించింది. 2,200 నుంచి 10 వేల అడుగులు నడవడం ద్వారా వ్యాధుల ప్రమాదాన్ని నివారించవచ్చు.

2 / 5
బిజీ లైఫ్‌లో సమయాన్ని వెచ్చించలేం కాబట్టి ఒక్క రోజులో పది వేల అడుగులు నడవం ఎలా సాధ్యమవుతుందనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. అందుకు కూడా ఓ పరిష్కారం ఉంది. అది ఆఫీసు అయినా లేదా ఇల్లు అయినా ఎలివేటర్‌ని ఉపయోగించడం మానేసి మెట్లు ఎక్కడం ప్రారంభిస్తే ఇది సాధ్యమే. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవాలంటే మెట్లను ఉపయోగించాలి.

3 / 5
ఆఫీసుకు వెళ్లేందుకు కారు లేదా స్కూటర్‌పై ఆధారపడకుండా ఆఫీస్ ముందు పార్కింగ్ చేయకుండా కాస్త దూరంగా మీ వాహనాన్ని పార్క్ చేయాలి. మీకు పెంపుడు జంతువులు ఉంటే దానిని తీసుకుని వాకింగ్‌కు వెళ్లవచ్చు.

4 / 5
పగలంతా సమయం లేకపోతే రాత్రి భోజనం చేసిన తర్వాత 30 నిమిషాలు నడవవచ్చు. ఈ సమయం నడకకు అనుకూలం. అలాగే రోజు వారీ సరుకుల కోసం ఆన్‌లైన్‌లో కాకుండా మార్కెట్‌కు వెళ్లి తాజా కూరగాయలు, ఇంటి సరుకులు తెచ్చుకోవడానికి నడుచుకుంటూ వెళ్లాలి. ఇలా చేస్తే శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవచ్చు. పాదాలు లేదా మోకాలి భాగంలో ఏదైనా సమస్య ఉంటే వాకింగ్‌ చేసే ముందు ఓసారి వైద్యుడిని సంప్రదించాలి. ఒక రోజులో మీరు ఎంత దూరం నడవగలరో తెలుసుకున్న తర్వాత మాత్రమే వాకింగ్‌ స్టార్ట్ చేయండి.

5 / 5
Follow us
Latest Articles