వన్ ప్లస్ నోర్డ్ సీఈ3 లైట్(OnePus Nord CE 3 Lite).. ఈ ఫోన్ ప్రారంభంలో 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌తో రూ.19,999కి లభించేది. అనంతరం ధరను తగ్గించారు. ఇప్పుడు 128 జీబీ వెర్షన్ రూ.17,999, అలాగే 256 జీబీ వేరియంట్ రూ.19,999 నుంచి ప్రారంభమవుతుంది. 6.72 అంగుళాల ఎల్ సీడీ డిస్‌ప్లే, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్‌సెట్‌తో ఆండ్రాయిడ్ 13 ఆధారంగా ఆక్సిజన్ ఓఎస్ 13పై రన్ అవుతోంది. 16 ఎంపీ ఫ్రంట్ షూటర్, 108 ఎంపీ ప్రైమరీ కెమెరా, 2 ఎంపీ మాక్రో లెన్స్, 2 ఎంపీ డెప్త్ కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 67W ఫాస్ట్ చార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. పాస్టెల్ లైమ్, క్రోమాటిక్ గ్రే కలర్లలో లభిస్తుంది.