- Telugu News Photo Gallery Viral photos World largest swimming pool san alfonso del mar it is difficult to swim across you can see photos
Viral Photos: ఇది ప్రపంచంలోనే అతి పెద్ద స్విమ్మింగ్ పూల్.. దీన్ని ఈదాలంటే దమ్ముండాలి..!
Viral Photos: ఈ భూప్రపంచంలో అద్భుతాలకు కొదవ లేదు. తెలిసిన అద్భుతాలు కొన్నే అయితే, తెలియని వింతలు, విశేషాలు మరెన్నో ఉన్నాయి. ఇవాళ మనం ఓ భారీ స్విమ్మింగ్ పూల్ గురించి తెలుసుకోబోతున్నాం. దానిని చూస్తే గుండెలదిరిపోవడం ఖాయం. ఎందుకంటే అంత పొడవుగా ఉంటుంది మరి.
Updated on: Nov 23, 2021 | 6:33 AM

ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్విమ్మింగ్ మానవ నిర్మితమైనదే. అయితే, ఇది చాలా పొడవుగా ఉంటుంది. దీనిని ఈదాలంటే సామాన్యులకు అయ్యే పని కాదు. ఒక పడవ అవసరం అవుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.

చిలీ రాజధాని శాంటియాగోలో ఉంది ఈ స్విమ్మింగ్ పూల్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్విమ్మింగ్ పూల్. దీనిని ఈదాలంటే సాధారణ మానవునికి వల్ల కాదు.

ఈ స్విమ్మింగ్ పూల్ ఒక కిలోమీటరు పొడవు ఉంటుంది. దీనిని 7.7 హెక్టార్లు అంటే 19 ఎకరాల్లో నిర్మించారు. ఇందులో దాదాపు 250 మిలియన్ లీటర్లు అంటే 66 మిలియన్ గ్యాలన్ల సముద్రపు నీరుతో నింపారు. ఇది చాలా పెద్దది, దీనిని దాటడానికి ఒక పడవ అవసరం పడుతుంది.

దీనిని నిర్మించడానికి దాదాపు 3.5 మిలియన్ యుఎస్ డాలర్లు ఖర్చు చేశారట. భారతీయ కరెన్సీలో చూస్తే దాదాపు 23 కోట్ల రూపాయలు అనమాట. ఈ స్విమ్మింగ్ పూల్‌కు నీటిని సరఫరా చేయడానికి పసిఫిక్ మహాసముద్రం నుండి పంపు సెట్లను ఏర్పాటు చేశారు. దీనిలో ఫిల్టర్ చేసిన నీరు మాత్రమే ఉపయోగించబడుతుంది.
