జాస్మిన్ ప్లాంట్: జాస్మిన్ ఇండోర్, అవుట్ డోర్ ప్లాంట్. ఇది వెదజల్లే పూల వాసన అద్భుతంగా ఉంటుంది. ఈ మనోహరమైన సువాసనలు మనసును ప్రశాంతపరుస్తాయి. మంచి నిద్రను ప్రోత్సహిస్తాయి. మల్లె మొక్కను స్టడీ రూమ్‌లో ఉంచడం వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన దూరమవుతాయని నమ్ముతారు. మనసు రిలాక్స్‌గా ఉంటుంది. అంతేకాదు.. సరైన నిర్ణయం తీసుకునే ప్రక్రియలో సహాయపడుతుంది. మెరుగైన ఏకాగ్రత, మెరుగైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యంతో విద్యార్థి జీవితంలో మరింత విశ్వాసాన్ని తెస్తుంది.