- Telugu News Photo Gallery Viral photos Most dangerous railway track in the world see these viral images
Viral Photos: ప్రపంచంలోని 5 ప్రమాదకరమైన రైల్వే ట్రాక్‌లు.. మీరెప్పుడైనా చూశారా.. లేకపోతే ఇప్పుడు చూడండి..
Viral Photos: ప్రపంచంలో అనేక రైల్వే ట్రాక్‌లు ఉన్నాయి. అందమైన ప్రకృతిని పెనవేసుకుని ఉన్నాయి. అదే సమయంలో ప్రమాదకరంగా, సాహసోపేతంగా కూడా ఉన్నాయి. గుండె ధైర్యం లేని వ్యక్తి ఆ రైలు మార్గాల్లో అసలు ప్రయాణించలేరంటే అతిశయోక్తి కాదు.
Updated on: Nov 23, 2021 | 6:35 AM

ఇవాళ మనం కొన్ని ప్రమాదకరమైన రైల్వే ట్రాక్‌ల గురించి చెప్పుకోబోతున్నాం. వీటిని చూసి కొందరు భయబ్రాంతులకు గురయితే.. మరికొందరు ప్రజలు ఆ జర్నీని ఎంజాయ్ చేస్తుంటారు.

సాల్టా పోల్వెరిల్లో ట్రాక్, అర్జెంటీనా: మొదటి రైల్వే ట్రాక్ సాల్టా పోల్వెరిల్లో ట్రాక్. దీన్ని తయారు చేయడానికి దాదాపు 27 ఏళ్లు పట్టిందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ ట్రాక్ సామాన్య ప్రజల కోసం 1948 సంవత్సరంలో ప్రారంభించబడింది. ఈ ట్రాక్ 4,200 ఎత్తులో ఉంది. ఏదైనా రైలు ఈ ట్రాక్ మీదుగా వెళ్ళినప్పుడు.. అది 29 వంతెనలు, 21 సొరంగాలను దాటుతుంది.

అసో మయామి రూట్, జపాన్: రెండవ రైల్వే ట్రాక్ అసో మయామి మార్గం. ఇది జపాన్‌లోని అత్యంత ఛాలెంజింగ్ రైల్ ట్రాక్‌లలో ఒకటి. 2016 సంవత్సరంలో కుమామోటోలో భూకంపం వచ్చినప్పుడు ట్రాక్ కొంత భాగం దెబ్బతింది. అప్పటి నుండి ఇది చాలా అరుదుగా ఉపయోగించబడుతుంది.

అసో మయామి రూట్, జపాన్: రెండవ రైల్వే ట్రాక్ అసో మయామి మార్గం. ఇది జపాన్‌లోని అత్యంత ఛాలెంజింగ్ రైల్ ట్రాక్‌లలో ఒకటి. 2016 సంవత్సరంలో కుమామోటోలో భూకంపం వచ్చినప్పుడు ట్రాక్ కొంత భాగం దెబ్బతింది. అప్పటి నుండి ఇది చాలా అరుదుగా ఉపయోగించబడుతుంది.

కేప్ టౌన్ దక్షిణాఫ్రికా: ఈ ట్రాక్ దొంగతనం, దాడి సంఘటనల వార్తలలో నిత్యం నిలుస్తుంటుంది. ఇక్కడి నుంచి ఏదైనా రైలు వెళ్లినప్పుడు ప్రయాణికులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందకని తరచూ రైళ్లను రద్దు చేస్తుంటారు.

డెవిల్స్ నోస్, ఈక్వెడార్: ఈ రైల్వే ట్రాక్ సముద్ర మట్టానికి దాదాపు 9 వేల అడుగుల ఎత్తులో నిర్మించబడింది. ఈ ట్రాక్ నిర్మాణ పనులు 1872 సంవత్సరంలో ప్రారంభమవగా.. 1905 లో ట్రాక్ పూర్తయింది. ఈ ట్రాక్‌ను నిర్మిస్తున్నప్పుడు, చాలా మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారని.. దాంతో దీనిని డెవిల్స్ నోస్ రైలు గా పిలవడం ప్రారంభించారు.
