మనుషుల్లోనే కాదు చేపల్లో కూడా జాతులు.. అప్పట్లోనే ఏ జాతి చేపను ఆ జాతివారు మాత్రమే తినాలి.. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
సీఫుడ్ లో ఒకటి చేప. వీటిల్లో పండుగప్ప, కొర్రమీను, సొర, పులస, ఇలస, చేదుపరిగలు. ఇలా అనేక రకాల చిన్న పెద్ద చేపలున్న సంగతి తెలిసిందే. అయితే మనుషుల్లో జాతులున్నట్లు చేపల్లో కూడా జాతులు ఉన్నాయనే సంగతి తెలుసా..!.బ్రాహ్మణ చేపలు, కాయస్థ చేపలు, ఫిరంగి చేపలు ఇలా అనేక రకాల జాతులున్నాయి. ఈ విషయం మీకు తమాషాగా అనిపించినా పూర్తిగా నిజం.
దేశంలోని ప్రజలు ఆహారం పద్దతులతో భిన్న మతాలు, వర్గాలు చీలిపోయాయి. ఈ నేపథ్యంలో చేపలకు కూడా స్వంత జాతులు ఉన్నాయి. బ్రాహ్మణ చేపలు, కాయస్థ చేపలు మరియు ఫిరంగి చేపలు.. ఈ విషయం మీకు తమాషాగా అనిపించినా అందులో నిజం ఉంది. చాలా కాలంగా ఇది వివక్షకు సాధనంగా మారింది. వలసరాజ్యాల కాలంలో ఈ వివక్ష ఎంతగా పెరిగిపోయిందంటే కులం, మతం ఆధారంగా చేపలను విభజించారు.
1 / 5
కులాలతో చేపలకు ఉన్న సంబంధం ఏమిటో విష్ణుపాల్ తన 'మానసమంగళ' పుస్తకంలో వివరించారు. 4 శతాబ్దాల క్రితం రచించిన మానసమంగళం పుస్తకంలో 36 రకాల చేపల గురించి చెప్పబడ్డాయి. మానస దేవి అనుగ్రహం వల్లనే చేపలు వలల్లో చిక్కుకుంటాయని పుస్తకంలో పేర్కొన్నారు. ఈ పుస్తకంలో ఎన్ని రకాల చేపల గురించి ప్రస్తావించారో ఇప్పుడు ,తెలుసుకుందాం..