హీలాంగ్జియాంగ్ ప్రావిన్స్‌లో ప్రతి ఏటా మంచు ఉత్సవాన్ని నిర్వహిస్తారు. . ప్రపంచం నలుమూలల నుండి మంచు కళాకారులు చాలా భారీ కళాకృతులను తయారు చేయడానికి ఇక్కడకు వస్తారు. ఈ మంచు ప్రపంచాన్ని నిర్మించటానికి దాదాపు 2,20,000 చదరపు మీటర్ల మంచును ఉపయోగించినట్లు చెప్తున్నారు. ఈ మంచు ఉత్సవం డిసెంబర్ 20 నుండి మొదలై ఫిబ్రవరి వరకు కొనసాగుతుంది. ఇక్కడ వాతావరణం చాలా చల్లగా ఉండటం వల్ల మంచు కరగదు.