Aditi Shankar : ఆహా.. బుట్టబొమ్మలా ముస్తాబైన యంగ్ హీరోయిన్ అదితి శంకర్
యంగ్ హీరోయిన్ అదితి శంకర్ 6 జూలై 1997న చెన్నైలో జన్మించింది. ప్రముఖ తమిళ దర్శకుడు ఎస్.శంకర్ కుమార్తె. చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఆసక్తి ఉన్నా తండ్రి కోరిక మేరకు మెడిసిన్ పూర్తి చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇప్పుడు హీరోయిన్ గా రాణిస్తుంది.
Updated on: Aug 09, 2025 | 10:08 PM

యంగ్ హీరోయిన్ అదితి శంకర్ 6 జూలై 1997న చెన్నైలో జన్మించింది. ప్రముఖ తమిళ దర్శకుడు ఎస్.శంకర్ కుమార్తె. చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఆసక్తి ఉన్నా తండ్రి కోరిక మేరకు మెడిసిన్ పూర్తి చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇప్పుడు హీరోయిన్ గా రాణిస్తుంది.

2022లో ముత్తయ్య దర్శకత్వం వహించిన “విరుమాన్” చిత్రంలో నటుడు కార్తీ సరసన కథానాయికగా నటించింది. ఈ మూవీతోనే సినీరంగంలోకి అడుగుపెట్టింది. తొలి చిత్రంతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. అలాగే తన గ్లామర్ తోనూ ఈ భామ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

అంతేకాదు ఇదే సినిమాలో “మధుర వీరన్” అనే సాంగ్ పాడి సింగర్ గానూ అదరగొట్టేసింది. నటిగానే కాకుండా ప్రముఖ నేపథ్య గాయని కూడా. 2022లో తెలుగు చిత్రం ‘ఘని’లో “రోమియోకు జూలియట్‌లా” పాట పాడటం ద్వారా గాయనిగా గుర్తింపు పొందింది.

ఆ తర్వాత మావీరన్ చిత్రంలో.. అనేక స్టేజ్ షోలలో సాంగ్స్ పాడి ఆకట్టుకుంది. నటిగా మెప్పిస్తూనే.. మరోవైపు విమర్శలను సైతం స్వీకరిస్తుంది అదితి. ఇటీవలే ఈ చిన్నది బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన భైరవం సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది క్రేజీ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో వదిలిన కొన్ని ఫొటోలు నెటిజన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫొటోల్లో బుట్టబొమ్మలా ముస్తాబయింది. ఈ ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.