- Telugu News Photo Gallery Vatu Tips: Where do you place a mirror in the house to bring luck? check details in Telugu
Vatu Tips: ఇంట్లో అద్దం ఎక్కడ పెడితే లక్ కలిసి వస్తుంది?
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో అన్నీ కరెక్ట్‌గా ఉంటేనే పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది. కుటుంబ సభ్యులు అందరూ సంతోషంగా, డబ్బుకు లోటు లేకుండా ఉంటారు. ఇంట్లో సరైన దిశలో వస్తువులు లేకపోయినా.. వాస్తు శాస్త్రం కరెక్ట్‌గా లేకున్నా ఎన్నో ఇబ్బందులు తలెత్తుతాయి. అదే క్రమంలో ఇంట్లో అదృష్టాన్ని ఆకర్షించడానికి వాస్తు శాస్త్రంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఇంట్లో ఉన్న అద్దంతో కూడా అదృష్టాన్ని కూడా ఆకర్షించవచ్చు. అద్దాన్ని పెట్టే ప్రదేశం బట్టి మీ ఇంటికి వచ్చే అదృష్టం..
Updated on: Jan 22, 2024 | 1:59 PM

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో అన్నీ కరెక్ట్‌గా ఉంటేనే పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది. కుటుంబ సభ్యులు అందరూ సంతోషంగా, డబ్బుకు లోటు లేకుండా ఉంటారు. ఇంట్లో సరైన దిశలో వస్తువులు లేకపోయినా.. వాస్తు శాస్త్రం కరెక్ట్‌గా లేకున్నా ఎన్నో ఇబ్బందులు తలెత్తుతాయి. అదే క్రమంలో ఇంట్లో అదృష్టాన్ని ఆకర్షించడానికి వాస్తు శాస్త్రంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి.

ఇంట్లో ఉన్న అద్దంతో కూడా అదృష్టాన్ని కూడా ఆకర్షించవచ్చు. అద్దాన్ని పెట్టే ప్రదేశం బట్టి మీ ఇంటికి వచ్చే అదృష్టం కూడా మారి పోతూ ఉంటుంది. అద్దాలను వీలైనంత వరకూ తూర్పు గోడలపైనే ఉంచాలి. అందం ఉంచడానికి ఈ దిశను అత్యంత పవిత్రంగా భావిస్తారు.

ఈ దిశలో అద్దాన్ని ఉంచడం వల్ల మీ ఆర్థిక పరిస్థితిలో మార్పులు చోటు చేసుకుంటాయి. అద్దం ఉంచడానికి ఈ దిశను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. అలాగే పొరపాటున కూడా అద్దాన్ని.. దక్షిణ లేదా పశ్చిమ గోడలపై ఉంచకుండా చూసుకోడాలి.

ఈ దిశలో అద్దాలను ఉంచితే చాలా నష్టం జరుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది. ముఖ్యంగా రెండు అద్దాలను ఒకదానికొకటి ముందు ఉంచకూడదట. ఇలా చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని సృష్టిస్తాయి. అలాగే అద్దాలను నేల నుంచి 4 లేదా 5 అడుగుల ఎత్తులో ఉండేలా చూసుకోవాలి.

ఇంట్లో అదృష్టాన్ని ఆకర్షించాలంటే.. డ్రెస్సింగ్ రూమ్, వాష్‌రూమ్, డైనింగ్ ప్రాంతంలో పెట్టుకోవచ్చు. ఇలా పెట్టడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, ఆప్యాయతలు పెరుగుతాయి. ఇంట్లో చతురస్రాకార, దీర్ఘ చతురస్రాకార అద్దాలు పెడితే చాలా మంచిది.




