కార్ వాన్‌లో జబర్దస్త్ బ్యూటీ అందాల విందు.. జర జాగ్రత్త అంటున్న ఫ్యాన్స్!
జబర్దస్త్ క్రేజీ బ్యూటీ వర్ష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కామెడీ పండించడంలోనే కాదు తన అందాలతో బాణాలు విసరడంలో కూడా ఈ ముద్దుగుమ్మ మొదటి స్థానంలోనే ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు కార్ వాన్ లో తన అందచందాలతో కుర్రకారును మాయచేసింది. కొంటె చూపు చూస్తూ.. నడుము ఒంపులతో హల్ చల్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఫొటోలపై మీరు కూడా ఓ లుక్ వేయండి మరి.
Updated on: Feb 18, 2025 | 11:16 AM

జబర్దస్త్ వర్ష గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. తన కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్స్‌తో ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ. మొదట సీరియల్స్ చేసిన వర్ష తర్వాత జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

మరీ ముఖ్యంగా ఈ బ్యూటీ ఇమ్మానుయేల్ తో జోడి కట్టి మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఈ జోడి అంటే ఓ స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇక ఈ అమ్మడు ఓ వైపు నవ్విస్తూనే మరో వైపు అందాలతో యూత్‌ను ఆగం చేసేస్తుంది.

ఈ మధ్య ఈ చిన్నది వరస ఫొటో షూట్స్ తో నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటుంది. ఓ వైపు కామెడీ షోలో నవ్వులు పూయిస్తూ... మరో వైపు తన గ్లామర్‌తో కట్టిపడేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ కార్ వాన్ లో తన అందాలతో మతిపొగొట్టింది.

తాజాగా వర్ష ఎంబ్రాయిడరీ వర్క్ డిజైన్ చేసిన మెరూన్ కలర్ బ్లౌజ్ ధరించి, వైట్ కలర్ లెహంగాలో అదరిపోయింది. ఎప్పటిలానే గ్లామర్ విందు ఇస్తూ... ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ పిక్స్ వర్ష తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో కార్ వాన్ లో నీ అందాలు చూస్తే ఎవరైనా పడిపోవాల్సిందే.. సో బ్యూటిఫుల్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తే, ఇమ్మన్యూల్ నీ వర్ష జాగ్రత్త అంటూ మరికొందరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.





























