Ayesha Khan: చీరకట్టులో వయ్యారాల సుందరి.. నడుమందాలతో మెంటలెక్కించే సొగసరి..
సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ హీరోయిన్ ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. ఇన్నాళ్లు సినిమాల్లో స్పెషల్ పాటలతో అలరించిన ఆ అమ్మడు.. ఇప్పుడు నెట్టింట క్రేజీ ఫోటోలతో మతిపోగొట్టేస్తుంది. తాజాగా చీరకట్టులో మెంటలెక్కించే ఫోజులతో నెట్టింట రచ్చ చేస్తుంది. ఈ బ్యూటీ క్రేజీ ఫోటోస్ ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటున్నాయి.
Updated on: Feb 18, 2025 | 9:59 AM

ఒకే ఒక్క సినిమాతో తెలుగు కుర్రకారు హృదయాలను దోచేసింది హీరోయిన్ అయేషా ఖాన్. ఒక సినిమాలో ఒక హీరోయిన్ అందంగా కనిపిస్తే బాగుందంటూ.. కొన్నాళ్లపాటు ఆమె హవా కొనసాగడం ఖాయమని అనుకుంటారు.

కానీ హీరోయిన్ అందాన్ని బీట్ చేసి అప్సరసలాంటి సుందరిని చూసి.. ఒక్కసారిగా ఆమె ఇండస్ట్రీలో సెన్సేషన్ అయ్యింది. తనే అయేషా ఖాన్.. ముఖచిత్రం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ.

ఆ సినిమాలో ఆమె పాత్ర పెద్దగా కనెక్ట్ కాకపోవడం వలన ప్రేక్షకులు ఆమెను అంతగా పట్టించుకోలేదు. కానీ ఆ తర్వాత గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా కంటే ముందు ఓం భీమ్ బుష్ సినిమాతో కుర్రకారు క్రష్ లిస్ట్ లోకి చేరింది. హిందీ బిగ్ బాస్ షోలో పాల్గోంది. హౌస్ నుంచి బయటకు వచ్చాకా అమ్మడికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.

విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. ప్రస్తుతం ఈ అమ్మడు సోషల్ మీడియాలో చీరకట్టులో షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటుంది.




