UK visa fee: ఆ రోజు నుంచి యూకే వీసాల ఫీజు పెరుగుతాయి.. ఎందుకంటే ?
విదేశీయులకు తమ దేశ వీసా ఫీజుల పెంపు అక్టోబర్ 4వ తేదీ నుంచి అమలులోకి వస్తుందంటూ బ్రిటన్ తెలిపింది. దీంతో ఆరు నెలలు.. అంతకంటే తక్కువ వ్యవధి ఉన్న పర్యాటక వీసాలపైన ఇప్పటి నుంచి 15 పౌండ్స్ ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. విద్యార్థి వీసాల ఫీజు కూడా 127 పౌండ్లు పెరుగుతున్నట్లు తెలిపింది. అయితే దీనికి ఇంకా బ్రిటన్ పార్లమెంట్ నుంచి ఆమోదం రావాల్సి ఉంది. అయితే, ఆ ప్రక్రియ లాంఛనమే అయినప్పటకీ.. భారత్‌తో పాటు ప్రపంచ దేశాల పౌరులకు సైతం ఇక నుంచి బ్రిటన్‌కు వెళ్లడం భారంగా మారనుంది.
Updated on: Sep 17, 2023 | 1:52 PM

విదేశీయులకు తమ దేశ వీసా ఫీజుల పెంపు అక్టోబర్ 4వ తేదీ నుంచి అమలులోకి వస్తుందంటూ బ్రిటన్ తెలిపింది. దీంతో ఆరు నెలలు.. అంతకంటే తక్కువ వ్యవధి ఉన్న పర్యాటక వీసాలపైన ఇప్పటి నుంచి 15 పౌండ్స్ ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.

విద్యార్థి వీసాల ఫీజు కూడా 127 పౌండ్లు పెరుగుతున్నట్లు తెలిపింది. అయితే దీనికి ఇంకా బ్రిటన్ పార్లమెంట్ నుంచి ఆమోదం రావాల్సి ఉంది. అయితే, ఆ ప్రక్రియ లాంఛనమే అయినప్పటకీ.. భారత్‌తో పాటు ప్రపంచ దేశాల పౌరులకు సైతం ఇక నుంచి బ్రిటన్‌కు వెళ్లడం భారంగా మారనుంది.

అయితే వీసా ఫీజు పెంపు తర్వాత ఆరు నెలల టూరిస్టు వీసా ఫీజు 115 జీబీపీలు ఉండగా.. విద్యార్థి వీసా ఫీజు 490 జీబీపీలకు చేరనున్నట్లు తెలుస్తోంది. ఇక విదేశీయుల వీసా ఫీజులతోపాటు జాతీయ ఆరోగ్య సేవకు వారు చెల్లించే సర్‌ఛార్జిని సైతం పెంచుతున్నట్లు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ జులైలోనే ప్రకటించారు.

బ్రిటన్‌లోని ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులకు జీతాలు పెంచినందువల్ల పడే భారాన్ని ఈ వీసా ఫీజుల పెంపు ద్వారా భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇక ఉపాధ్యాయులు, పోలీసులతో పాటు ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు 5 శాతం నుంచి 7 శాతం వరకు జీతాలను పెంచాలని స్వతంత్ర రివ్యూ కమిటీ సిఫార్సులకు అంగీకరించిన సునాక్ ఆ భారాన్ని విదేశస్థులపై వేయాలని నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

ఇదిలా ఉండగా.. బ్రిటన్ ప్రజల నుంచి పన్నుల రూపంలో వచ్చే డబ్బును జీతాల కోసం ఖర్చు చేయడం తనకు ఇష్టం లేదని, అందుకే వీసా ఫీజులను, ఇమ్మిగ్రేషన్ హెల్త్ సర్‌ఛార్జిని పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు సునాక్ తెలిపారు. అయితే ఈ పెంపు వల్ల బ్రిటన్ ఖాజానాకు బిలియన్ జీబీపీల ఆదాయం సమకూరే అవకాశం ఉన్నట్లు నిపుణలు అంచనా వేస్తున్నారు.
