AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: దేశంలో అత్యంత మురికిగా ఉన్న రైల్వే స్టేషన్లు..! టాప్ 10లో 6 ఒకే రాష్ట్రంలోవి..!

భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో ఒకటి. ఇది దేశవ్యాప్తంగా 7,300కి పైగా రైల్వే స్టేషన్లను కలిగి ఉంది. ఇన్ని స్టేషన్ల నిర్వహణ అనేది చాలా సవాలుతో కూడిన పని. గత దశాబ్దకాలంగా కేంద్ర ప్రభుత్వం రైల్వే స్టేషన్లను ఆధునికంగా తీర్చిదిద్దేందుకు విపరీతంగా కృషి చేస్తోంది. సెమీ హైస్పీడ్ రైళ్లను ప్రారంభించడంతో పాటు రైల్వే స్టేషన్ల పునరుద్ధరణ కోసం భారీగా నిధులు వెచ్చిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా పలు రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. అయితే ఈ ప్రగతికి దారితీయాల్సిన కొన్ని స్టేషన్లు అధ్వాన్న స్థితిలో ఉన్నాయి. పరిశుభ్రత ర్యాంకింగ్‌లో అత్యుత్తమంగా నిలిచిన టాప్ 10 స్టేషన్లలో 7 స్టేషన్లు రాజస్థాన్‌లో ఉండగా అత్యంత అపరిశుభ్రంగా ఉన్న టాప్ 10 స్టేషన్లలో 6 స్టేషన్లు తమిళనాడులో ఉన్నాయి. టాప్ 10 మురికి రైల్వే స్టేషన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Prashanthi V
|

Updated on: Jan 27, 2025 | 8:01 AM

Share
తమిళనాడులోని పెరుంగళత్తూరు స్టేషన్ దేశంలోని అత్యంత మురికి రైల్వే స్టేషన్లలో మొదటి స్థానంలో ఉంది. పరిశుభ్రతలో పూర్తిగా వెనుకబడిన ఈ స్టేషన్ రైల్ స్వచ్ఛ్ పోర్టల్ ప్రకారం అగ్రస్థానాన్ని సంపాదించింది.

1 / 10
తమిళనాడులోని గిండి రైల్వే స్టేషన్ అపరిశుభ్రతలో రెండో స్థానాన్ని దక్కించుకుంది.

2 / 10
దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న సదర్ బజార్ రైల్వే స్టేషన్ మూడవ స్థానంలో నిలిచింది. చెత్త పడేయడం, డ్రైనేజీ సమస్యల కారణంగా మురికి రైల్వే స్టేషన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

3 / 10
తమిళనాడులోని వేలచ్చేరి స్టేషన్ టాప్ 10 అపరిశుభ్ర స్టేషన్లలో నాలుగవ స్థానంలో ఉంది.

4 / 10
తమిళనాడులోనే గుడువాంచెరి స్టేషన్ ఐదవ స్థానంలో ఉండటం దురదృష్టకరం.

5 / 10
తమిళనాడుకు చెందిన సింగపెరుమాల్కోయిల్ స్టేషన్ మురికి స్టేషన్లలో 6వ స్థానాన్ని సంపాదించింది.

6 / 10
కేరళలోని ఒట్టపాలెం స్టేషన్ కూడా ఈ లిస్టులో 7వ స్థానంలో ఉంది.

7 / 10
తమిళనాడులోని పజవంతంగల్ రైల్వే స్టేషన్ 8వ స్థానంలో ఉంది.

8 / 10
బీహార్‌లోని అరారియా కోర్ట్ రైల్వే స్టేషన్ మురికి రైల్వే స్టేషన్లలో 9వ స్థానంలో నిలిచింది.

9 / 10
ఉత్తర ప్రదేశ్‌లోని ఖుర్జా స్టేషన్ ఈ లిస్టులో 10వ స్థానంలో ఉంది.

10 / 10
Follow Us