AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jowar Roti Benefits: రోజూ జొన్న రొట్టె తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా..!

ప్రస్తుత కాలంలో ప్రజలు ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ.. పాతకాలపు ఆహారపు అలవాట్లను తిరిగి స్వీకరిస్తున్నారు. వాటిలో ఒకటి జొన్న రొట్టెలను తిరిగి ఆహారంలో భాగం చేసుకోవడం. జొన్న రొట్టెలకు ఉన్న పోషకాలతో పాటు మన ఆరోగ్యానికి అందించే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

Prashanthi V
|

Updated on: Jan 27, 2025 | 7:39 AM

Share
జొన్న రొట్టెలలో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు విరివిగా ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. రోజూ జొన్న రొట్టెలు తినడం వల్ల మన శరీరానికి కావాల్సిన శక్తి చక్కగా అందుతుంది. ఈ రొట్టెలు తినడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండటమే కాకుండా శారీరక శక్తి తగ్గకుండా ఉంటుంది.

1 / 8
జొన్నల్లో ఫైబర్ అధికంగా ఉండటం వలన జీర్ణవ్యవస్థను క్రమబద్ధంగా పనిచేయించే గుణం ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని తగ్గించి పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియను సజావుగా చేయడం ద్వారా శరీరానికి తేలికగా ఉండే అనుభూతి కలుగుతుంది.

2 / 8
జొన్న రొట్టెల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది త్వరగా ఆకలి వేయకుండా చేయడంతో పాటు కొంచెం తిన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. దీని ద్వారా అధిక కేలరీల జోగుపై నియంత్రణ సాధించి అధిక బరువును నియంత్రించవచ్చు. అలాగే ఇది అనవసరమైన కొలెస్ట్రాల్ని తగ్గించడంలో దోహదం చేస్తుంది.

3 / 8
జొన్న రొట్టెలలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు సులభంగా నియంత్రణలో ఉంటాయి. మధుమేహం ఉన్నవారు దీన్ని ఆహారంలో చేర్చుకుంటే గ్లూకోజ్ స్థాయిలను క్రమబద్ధంగా ఉంచడంలో ఇది సహాయపడుతుంది.

4 / 8
జొన్న రొట్టెలలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని విషపదార్థాలను తొలగించడంలో, చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడతాయి. గుండె సంబంధిత వ్యాధులను నివారించి, గుండె పనితీరును మెరుగుపరచడంలో జొన్న రొట్టెలు ముఖ్యపాత్ర పోషిస్తాయి.

5 / 8
జొన్న రొట్టెలలో పొటాషియం, విటమిన్ బి, మెగ్నీషియం, క్యాల్షియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరానికి అవసరమైన అనేక పోషకాలను అందించి మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

6 / 8
జొన్న రొట్టెలు రక్తహీనతను తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో, రక్తం నిర్మాణాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. రక్తహీనత సమస్య ఉన్నవారు దీనిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.

7 / 8
జొన్న రొట్టెలలో మెగ్నీషియం, క్యాల్షియం పుష్కలంగా ఉండటంతో ఎముకల బలాన్ని పెంచి, వాటిని దృఢంగా మారుస్తాయి. ఇది ఎముకల సంబంధిత సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.

8 / 8
Follow Us