AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cholesterol: మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే చెడు కొలెస్ట్రాల్‌కు సంకేతాలు..!

Cholesterol: కొలెస్ట్రాల్‌.. ఈ విషయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. శరీరంలో కొలెస్ట్రాల్‌ పెరిగితే ఎన్నో సమస్యలు వస్తాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ పెరగకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపించినట్లయితే మీకు చెడు కొలెస్ట్రాల్‌ స్థాయి పెరుగుతున్నట్లు గమనించాలి.

Cholesterol: మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే చెడు కొలెస్ట్రాల్‌కు సంకేతాలు..!
Subhash Goud
|

Updated on: Jan 27, 2025 | 5:33 AM

Share

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతుంటాయి. చాలా మందిలో కొలెస్ట్రాల్‌ పెరిగి గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు. కొలెస్ట్రాల్ పెరిగినట్లయితే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదంటున్నారు నిపునులు. లిపిడ్ పరీక్ష ద్వారా కొలెస్ట్రాల్‌ స్థాయి తెలుసుకోవచ్చు. కానీ శరీరంలో LDL అంటే చెడు కొలెస్ట్రాల్ పెరగడం మొదలవుతుందని సూచించే కొన్ని లక్షణాలు శరీరంపై కనిపిస్తాయి. ఈ లక్షణాలు గుర్తించినట్లయితే కొలెస్ట్రాల్‌ను నియంత్రించవచ్చు. మీరు ముఖంపై ఇలాంటి లక్షణాలు కనిపించినట్లయితే తప్పకుండా కొలెస్ట్రాల్ చెక్ చేసుకోండి.

  1. చర్మం పసుపు: ముఖంపై పసుపు రంగు కనిపిస్తే అది రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల వస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు అది రక్త ప్రసరణను అడ్డుకుంటుంది. దీని కారణంగా చర్మంపై పసుపు రంగు కనిపించడం ప్రారంభమవుతుంది.
  2. ముఖం మీద గడ్డలు: కొన్నిసార్లు ముఖంపై చిన్న చిన్న గడ్డలు కనిపిస్తాయి. నొప్పి లేకుండా జరిగేది. అలాంటి చిన్నపాటి గడ్డలను విస్మరిస్తుంటారు. కానీ సాధారణంగా కళ్ల చుట్టూ ఏర్పడే ఈ గడ్డలు అధిక చెడు కొలెస్ట్రాల్ అని అర్థం.
  3. కళ్ల చుట్టూ పసుపు మచ్చలు: చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు, కళ్ల చుట్టూ లేత పసుపు రంగు దద్దుర్లు, కొన్ని చిన్న పసుపు మొటిమలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపించినట్లయితే చెడు కొలెస్ట్రాల్‌ పెరగడానికి సంకేతాలుగా గుర్తించండి.
  4. ముఖం మీద వాపు: ముఖం మీద వాపు రావడానికి చాలా కారణాలు ఉండవచ్చు. కానీ కొన్నిసార్లు చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల కూడా ఈ వాపు వస్తుంది. దీని వల్ల ముఖం ఉబ్బినట్లు కనిపిస్తుంది. లేదా చర్మం పూర్తిగా పొడిబారుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)