Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చీప్‌గా చూడకండి.. ఆ సమస్యలకు బ్రహ్మాస్త్రం లాంటిది.. ఉదయాన్నే ఒకే ఒక్క గ్లాస్ తాగితే..

బీట్‌రూట్‌ను చాలా మంది దీని రుచిని ఇష్టపడరు.. కానీ దాని పోషక విలువలు తెలిసిన వారు తమ రోజువారీ ఆహారంలో ఖచ్చితంగా చేర్చుకుంటారు. బీట్‌రూట్ తీసుకోవడం వల్ల మలబద్ధకం, ఊబకాయం, అలసట వంటి సమస్యల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.. శరీరాన్ని దృఢంగా చేస్తుంది. ఉదయాన్నే బీట్‌రూట్‌ జ్యూస్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకోండి..

చీప్‌గా చూడకండి.. ఆ సమస్యలకు బ్రహ్మాస్త్రం లాంటిది.. ఉదయాన్నే ఒకే ఒక్క గ్లాస్ తాగితే..
బీట్‌రూట్ లేదా ఎరుపు రంగు కలిగిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల బీటూరియా లక్షణాలను అభివృద్ధి చేస్తుంది. బీట్‌రూట్‌ జ్యూస్‌ ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రం లేదా మలం ఎర్రగా మారడాన్ని బీటూరియా అంటారు.
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 27, 2025 | 7:49 AM

భూగర్భంలో పండించే బీట్‌రూట్‌లో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. అందుకే.. మంచి ఆరోగ్యం కోసం బీట్‌రూట్ తప్పనిసరిగా తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తుంటారు.. దుంప జాతికి చెందిన బీట్‌రూట్‌లలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.. ఇవి మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో.. రోగాలు రోగాలను దూరం చేయడంలో సహాయపడతాయి.. అయితే.. బీట్‌రూట్‌ను అనేక విధాలుగా తీసుకోవచ్చు.. కూరగా, చట్నీగా.. సలాడ్ లేదా జ్యూస్‌గా తీసుకోవచ్చు.. ఇంకా పలు స్పెషల్ వంటకాలను కూడా తయారుచేసుకోవచ్చు.. అయితే.. బీట్‌రూట్‌ను చాలా మంది దీని రుచిని ఇష్టపడరు.. కానీ దాని పోషక విలువలు తెలిసిన వారు తమ రోజువారీ ఆహారంలో ఖచ్చితంగా చేర్చుకుంటారు. బీట్‌రూట్ తీసుకోవడం వల్ల మలబద్ధకం, ఊబకాయం, అలసట వంటి సమస్యల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.. శరీరాన్ని దృఢంగా చేస్తుంది.

బీట్‌రూట్‌లో లభించే పోషకాలు:

బీట్‌రూట్‌లో కాల్షియం, ఐరన్, యాంటీఆక్సిడెంట్‌లతో సహా అనేక పోషకాలు ఉన్నాయి. మీరు 10 గ్రాముల బీట్‌రూట్ తింటే.. మీకు 43 మిల్లీగ్రాముల కేలరీలు, 2 గ్రాముల కొవ్వు మాత్రమే లభిస్తుంది.. అంటే శరీర బరువు పెరగదు. ఇది మన శరీర అభివృద్ధికి చాలా ముఖ్యమైన పోషకమైన ప్రోటీన్లను కూడా పుష్కలంగా అందిస్తుంది.. బీట్ రూట్‌లలో బీటాలైన్లతోపాటు విటమిన్ సి, ఐరన్, పొటాషియం, ఫోలేట్, డైటరీ ఫైబర్ ఉంటాయి.. ప్రతిరోజూ ఉదయం బీట్‌రూట్ జ్యూస్ తాగితే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.. నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

బీట్‌రూట్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:

  • బీట్‌రూట్ తినడం వల్ల చాలా ప్రయోజనాలు చేకూరుతాయి.. అందుకే.. వైద్య నిపుణులు దీనిని సూపర్‌ఫుడ్ గా పేర్కొంటారు..
  • బీట్‌రూట్ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.. ఇది అనేక రకాల వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని రక్షిస్తుంది. ముఖ్యంగా దాని జ్యూస్.. సలాడ్.. లేదా పచ్చిగా తిన్నా.. చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు.
  • తరచుగా మలబద్ధకం, పొట్ట సమస్యలతో బాధపడేవారు బీట్‌రూట్‌ను తప్పనిసరిగా తీసుకోవాలి.. ఎందుకంటే ఇందులో ఉండే ఫైబర్ మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీంతో బరువు కూడా తగ్గవచ్చు..
  • బీట్‌రూట్ సహజ చక్కెరకు గొప్ప మూలం.. ఇది మన శరీరానికి శక్తిని అందించడానికి పనిచేస్తుంది. దీంతో అలసట దూరం అవుతుంది.
  • మీరు అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్లయితే, మీరు బీట్‌రూట్ సలాడ్ లేదా జ్యూస్‌ని తప్పనిసరిగా తీసుకోవాలి.. ఇలా చేయడం ద్వారా మీ బీపీ కొద్ది రోజుల్లోనే అదుపులో ఉంటుంది.
  • తరచుగా అలసట లేదా బలహీనత గురించి ఫిర్యాదు చేసే వారికి బీట్‌రూట్ దివ్యౌషధం కంటే తక్కువ కాదు.
  • బీట్‌రూట్ తినడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. రక్తహీనత సమస్య దూరమవుతుంది. ఇది శరీరంలో ఆక్సిజన్ స్థాయిని పెంచుతుంది.
  • బీట్‌రూట్ మన అందానికి కూడా చాలా ముఖ్యమైనది.. ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.. ముఖంపై అద్భుతమైన మెరుపును తెస్తుంది.

బీట్ రూట్ జ్యూస్ ఉదయం తీసుకోవడం చాలామంచిది.. ఒకవేళ తీసుకోలేకపోతే.. రోజులో ఎప్పుడైనా తీసుకోవచ్చు..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..