AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breast Cancer: అలర్ట్.. మహిళలకే కాదు.. మగవారికీ ముప్పేనట.. రొమ్ము క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయంటే..

రొమ్ము క్యాన్సర్‌తో ఏటా లక్షల మంది మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారు. మహిళలు క్యాన్సర్ ప్రారంభ లక్షణాలను అర్థం చేసుకోలేరు.. దీని కారణంగా సరైన సమయంలో చికిత్స అందదు.. రొమ్ము క్యాన్సర్  ప్రారంభ లక్షణాలు ఎలా ఉంటాయి.. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి.. వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు..? ఈ వివరాలను తెలుసుకోండి..

Breast Cancer: అలర్ట్.. మహిళలకే కాదు.. మగవారికీ ముప్పేనట.. రొమ్ము క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయంటే..
Breast Cancer
Shaik Madar Saheb
|

Updated on: Jan 27, 2025 | 11:14 AM

Share

మహిళల్లో ఎక్కువగా వచ్చే క్యాన్సర్లలో బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి.. దీంతో ఏటా లక్షల మంది మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే.. రొమ్ము క్యాన్సర్ ప్రారంభ లక్షణాలను గుర్తించడం ద్వారా, మహిళలు ఈ ప్రమాదకరమైన వ్యాధిని నివారించవచ్చు. చాలా సార్లు మహిళలు ప్రాథమిక లక్షణాలను అర్థం చేసుకోలేరు.. అటువంటి పరిస్థితిలో ప్రమాదకర క్యాన్సర్‌కు సరైన సమయంలో చికిత్స జరగదు. దీంతో ప్రాణాలు కోల్పోతున్నారు.. అయితే.. మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది తరచూ వింటుంటాం.. కానీ ఇది పురుషులకు కూడా రావొచ్చంటూ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్‌ను సకాలంలో గుర్తించడం.. సరైన చికిత్స అందించడం ద్వారా ఈ మహమ్మారి నుంచి బయటపడొచ్చు.. బ్రెస్ట్ కాన్సర్ గురించి నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి..

అన్ని గడ్డలూ క్యాన్సర్ కాదు..

క్యాన్సర్ లక్షణాలు, చికిత్స, కారణాలను అర్థం చేసుకుంటే.. మన ఆరోగ్యంపై మరింత నియంత్రణను కలిగి ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు. రొమ్ము క్యాన్సర్ ప్రారంభ లక్షణాలను పరిశీలిస్తే.. రొమ్ము లేదా చంకలో ఒక గడ్డ లాంటి పరిస్థితిని అనుభవించవచ్చు.. ఇది సాధారణంగా నొప్పిని కలిగించదు.. అయితే, అన్ని గడ్డలూ క్యాన్సర్ కాదు.. కానీ వాటి పరిశోధన అవసరం. బ్రెస్ట్ సైజులో గానీ, షేప్ లో గానీ ఏదైనా మార్పు కనిపిస్తే అది ఏదో సమస్యకు సంకేతంగా ఉంటుందని అంటున్నారు. ఇది కాకుండా, చర్మం ఎర్రగా మారడం, మసకబారడం లేదా నారింజ తొక్కలా కనిపించడం వంటివి రొమ్ము క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు..

రొమ్ము క్యాన్సర్ లక్షణాలు

చనుమొన నుంచి ఉత్సర్గ లేదా సాగిపోవడం, ప్రత్యేకించి రక్తం లేదా ఇతర ద్రవం ఉత్సర్గ ఉంటే.. ఆందోళన కలిగించే విషయం.. ఉత్సర్గ అంటే శరీరం నుండి బయటకు వచ్చే ద్రవం..

దీనితో పాటు, రొమ్ము దగ్గర నొప్పి చాలా కాలం పాటు కొనసాగితే.. దానిని పరిశీలించాల్సిన విషయం.. ఇంకా చంకలో శోషరస గ్రంథులు వాపు లేదా విస్తరించడం క్యాన్సర్ సంకేతం కావచ్చు.

క్యాన్సర్ చికిత్స ..

క్యాన్సర్ చికిత్స గురించి వైద్య నిపుణులు మాట్లాడుతూ.. క్యాన్సర్ కు అనేక విధాలుగా చికిత్స చేయవచ్చని చెప్పారు. ఇందులో మొదటిది శస్త్ర చికిత్స. శస్త్రచికిత్స సహాయంతో కణితి తొలగిస్తారు. ఇది కాకుండా రేడియేషన్ థెరపీ ఉంది. దీని కింద, క్యాన్సర్ కణాలను నాశనం చేయడానికి రేడియేషన్ ఉపయోగిస్తారు. దీనితో పాటు, చికిత్స కోసం కీమోథెరపీని కూడా ఉపయోగించవచ్చు. ఇది మందుల ద్వారా క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుంది లేదా వాటి పెరుగుదలను ఆపుతుంది. అదే సమయంలో, హార్మోన్ థెరపీతో కూడా చికిత్స చేయవచ్చు. దీని కింద, హార్మోన్ ఈస్ట్రోజెన్ లేదా ప్రొజెస్టెరాన్ ప్రభావం తగ్గుతుంది.. తద్వారా క్యాన్సర్ పెరుగుదలను నియంత్రిస్తుంది.

ఏ వయస్సులో ఎక్కువ ప్రమాదం ఉంటుంది?..

50 ఏళ్లు పైబడిన మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని వైద్య నిపుణులు వివరిస్తున్నారు. కుటుంబంలో ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే, మరొకరికి వచ్చే అవకాశాలు పెరుగుతాయి. దీని వెనుక ఒక్కోసారి హార్మోన్ల కారణాలు కూడా ఉంటాయని అంటున్నారు. ఇందులో బహిష్టు త్వరగా రావడం, ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ ఎక్కువసేపు ఉండటం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత అతిగా మద్యం సేవించడం.. వ్యాయామం లేకపోవడం, అధిక బరువు వంటివి బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పును పెంచుతాయని డాక్టర్ వివరిస్తున్నారు. రొమ్ము క్యాన్సర్ ఈ లక్షణాలను.. కారణాలను తెలుసుకోవడం ద్వారా మనం దానిని సకాలంలో గుర్తించగలము.. మెరుగైన చికిత్స ఎంపికలను కనుగొనగలము.. అని వైద్య నిపుణులు చెబుతున్నారు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..