నిమ్మకాయ: చర్మ సంరక్షణలో ఉత్తమమైన నిమ్మకాయ, అండర్ ఆర్మ్స్ వాసనతో పాటు నల్లమచ్చలను కూడా తొలగిస్తుంది. ఇందుకోసం ఒక టీస్పూన్ నిమ్మరసంలో అర టీస్పూన్ బేకింగ్ సోడా మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని చేతుల కింద భాగంలో అప్లై చేయాలి. కొద్ది సేపటి తర్వాత చల్లటి నీటితో మాత్రమే శుభ్రం చేసుకోవాలి.