పుల్లటి పెరుగును నేరుగా చర్మంపై అప్లై చేయవచ్చు. లేదంటే పుల్లటి పెరుగులో ఒక స్పూన్ తేనే కలుపుకుని ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. ఈ ప్యాక్ తక్షణమే చర్మ కాంతిని పునరుద్ధరిస్తుంది. పుల్లటి పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. మరోవైపు, తేనెలో హ్యూమెక్టెంట్లు ఉంటాయి. ఈ రెండు పదార్థాలు చర్మంపై సహజ మాయిశ్చరైజర్లుగా పనిచేస్తాయి. అలాగే పుల్లటి పెరుగు, తేనె చర్మానికి సహజమైన ఎక్స్‌ఫోలియేటర్‌లుగా పనిచేస్తాయి.