- Telugu News Photo Gallery This is what happens when children eat an egg every day, Check Here is Details
Egg for Children: పిల్లలు ప్రతి రోజూ ఓ గుడ్డు తింటే జరిగేది ఇదే!
చిన్న పిల్లలైనా, పెద్దవాళ్లైనా ప్రతి రోజూ ఉడకబెట్టిన గుడ్డు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. గుడ్డు చేసే మేలు అంతా ఇంతా కాదు. రోజూ ఒక గుడ్డు తిన్నా వైద్యులకు దూరంగా ఉండొచ్చు..
Updated on: Nov 07, 2024 | 6:00 PM

కోడి గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. ప్రతి రోజూ ఓ గుడ్డు తినడం వల్ల వైద్యులకు దూరంగా ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గుడ్డులో శరీరానికి కావాల్సిన పోషకాలు ఎన్నో ఉన్నాయి. ప్రోటీన్‌కి గుడ్డు మంచి సోర్స్ అని చెప్పొచ్చు.

ఆరోగ్య నిపుణులు చెప్పిన దాని ప్రకారం.. సంవత్సరం వయసు ఉన్న పిల్లలకు ఖచ్చితంగా కోడి గుడ్డు పెట్టాలి. ప్రతి రోజూ ఉదయం ఉడక బెట్టిన గుడ్డు పెట్టడం వల్ల పిల్లలు బలంగా, దృఢంగా తయారవుతారు. గుడ్డు పెట్టడం వల్ల ఎలాంటి సమస్యలు రావు.

కోడి గుడ్డులో అనేక రకాల మంచి పోషకాలు లభిస్తాయి. ఇవి పిల్లల మెదడు యాక్టివ్‌గా పని చేసేందుకు హెల్ప్ చేస్తుంది. గుడ్డు తినడం వల్ల పిల్లల కండరాలు బలంగా ఉంటాయి. ప్రోటీన్ అందుతుంది. మంచి కొవ్వులు అందుతాయి. ఆరోగ్యకరమైన బరువు ఉంటారు.

గుడ్డు తింటే జ్ఞాపకశక్తి చక్కగా అభివృద్ధి చెందుతుంది. త్వరగా నేర్చుకునే సామర్థ్యం పెరుగుతుంది. ఎముకలు బలంగా ఉంటాయి. ఎముకలకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. దంత ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది.

కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. త్వరగా కళ్ల జోడు పడకుండా ఉంటుంది. అలాగే చర్మం, జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. హానికర సూర్య కిరణాల నుంచి కాపాడుతుంది. ముఖ్యంగా జీర్ణ క్రియ సమస్యలు కూడా రావు. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే)




