- Telugu News Photo Gallery This is what happens when camphor is applied to the body, check here is details in Telugu
Camphor: కర్పూరాన్ని ఒంటికి రాస్తే జరిగేది ఇదే.. వేసవికి బెస్ట్!
కర్పూరం గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. పూజలో కర్పూరానికి ఉండే స్పెషలే వేరు. కర్పూరం కేవలం పూజకు మాత్రమే కాదు.. ఆరోగ్యానికి, అందాన్ని పెంచడంలో కూడా చక్కగా హెల్ప్ చేస్తుంది. శరీరానికి సంబంధించిన ఎన్నో సమస్యలకు చెక్ పెట్టగలదు. కర్పూరాన్ని శరీరానికి రాసుకోవడం వల్ల చాలా రకాల ఉపయోగాలున్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కర్పూరంలో యాంటీ ఆక్సిడెంట్లు, డీకాంగెస్టెంట్, లినాలూల్, పినేన్ బి-పినేన్, లిమోనెన్..
Updated on: Jun 03, 2024 | 8:17 PM

కర్పూరం గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. పూజలో కర్పూరానికి ఉండే స్పెషలే వేరు. కర్పూరం కేవలం పూజకు మాత్రమే కాదు.. ఆరోగ్యానికి, అందాన్ని పెంచడంలో కూడా చక్కగా హెల్ప్ చేస్తుంది. శరీరానికి సంబంధించిన ఎన్నో సమస్యలకు చెక్ పెట్టగలదు.

కర్పూరాన్ని శరీరానికి రాసుకోవడం వల్ల చాలా రకాల ఉపయోగాలున్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కర్పూరంలో యాంటీ ఆక్సిడెంట్లు, డీకాంగెస్టెంట్, లినాలూల్, పినేన్ బి-పినేన్, లిమోనెన్, సెబినెన్ అనే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో యూజ్ ఫుల్‌గా ఉంటాయి.

కర్పూరం శరీరానికి రాసుకోవడం వల్ల కీళ్లనొప్పులను తగ్గించుకోవచ్చు. కర్పూరాన్ని పొడిలా చేసి.. నీటిలో కలిపి.. కీళ్లపై అప్లై చేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. కండరాల నొప్పులు కూడా తగ్గుతాయి.

వేసవిలో చెమట కాయలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. వీటితో దురద, మంట అనేది వస్తూ ఉంటుంది. కొబ్బరి నూనెలో కర్పూరం కలిపి శరీరం అంతా రాయాలి. గాయాలు త్వరగా మానాలంటే.. కర్పూరాన్ని నీటిలో కలిపి రాయండి.

చుండ్రు సమస్యతో ఇబ్బంది పడేవారు.. కొబ్బరి నూనెలో కర్పూరం రాసి.. తలకు రాస్తే చుండ్రు తగ్గుతుంది. అలాగే శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటివారు.. ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనెలో కలిపిన కర్పూరం ఒంటికి రాసుకుని పడుకుంటే మంచి ఫలితం ఉంటుంది.




