- Telugu News Photo Gallery These zodiac signs will gain wealth in crores due to the impact of solar eclipse
సూర్య గ్రహణం ఎఫెక్ట్.. వీరికి కోట్లలో సంపద!
ఒక సంవత్సరంలో సూర్యగ్రహణం, చంద్ర గ్రహణం రావడం అనేది సహజం. అయితే ఇప్పటికే రెండు చంద్రగ్రహణాలు ఏర్పడగా, ఒక సూర్యగ్రహణం ఏర్పడింది. అలాగే సెప్టెంబర్ 21న రెడో సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఇక గ్రహణం ప్రతి దానిపై ప్రభావం చూపిస్తుంది. అందుకే ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటారు. అయితే2025 సెప్టెంబర్ 21న ఏర్పడే సూర్య గ్రహణం 12 రాశుల పై తన ప్రభావం చూపెడుతుందంట.
Updated on: Sep 15, 2025 | 6:29 PM

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ సంవత్సరం రెండవ, చివరి సూర్యగ్రహణం సెప్టెంబర్ 21 ఆదివారం రోజున ఏర్పడనుంది. అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. కాబట్టిదీని ప్రభావం మన దేశంపై ఉండదు. కానీ ఇది 12 రాశులను మాత్రం తప్పకుండా ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు పండితులు. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి సూర్యగ్రహం అదృష్టాన్ని తీసుకొస్తుందంట.

మహాలయ అమావాస్య, పితృ అమావాస్య రోజున రెండో సూర్య గ్రహణం ఏర్పడనుంది. ఇది రాత్రి 11 గంటలకు ప్రారంభమైన, తెల్ల వారుజామున 3 : 24 గంటలకు ముగుస్తుంది. ఈ సూర్యగ్రహణం కన్యారాశిలో ఏర్పడగా, ఆ సమయంలో శని తిరోగమనంలో ఉంటాడు. దీని వలన మూడు రాశుల వారికి కోట్లలో సంపద రావడం ఖాయం అంటున్నారు పండితులు. మరి ఆ రాశుల వారు ఎవరో ఇప్పుడు చూసేద్దాం.

సింహ రాశి : సింహ రాశి వారికి సూర్యగ్రహణం వలన అదృష్టం కలిసి వస్తుంది. వీరి సంపద రెట్టింపు అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఊహించని స్థాయిలో డబ్బులు సంపాదిస్తారు. ఆర్థికంగా కలిసి రావడంతో వీరి ఆనందానికి అవధులు ఉండవు. ఏ పని చేసినా కలిసి వస్తుంది. ఈ రాశి వారికి ఈ సమయంలో పట్టిందల్లా బంగారమే కానున్నది.

కుంభ రాశి : కుంభ రాశి వారికి చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా బాగుంటుంది. ఉద్యోగంలో ఉన్న వారికి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఇంటా బయట సానుకూల ప్రభావం ఉంటుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. చాలా ఆనందంగా గడుపుతారు.

తుల రాశి : తుల రాశి వారికి సూర్యగ్రహణం ప్రభావంతో చాలా బాగుటుంది. ఈ రాశి వారు కోట్లలో డబ్బులు సంపాదించడం ఖాయం. అంటే వీరు డబ్బును ఎక్కువగా పొదుపు చేస్తారు. ఆరోగ్యం బాగుటుంది. పట్టిందల్లా బంగారమే కానుంది. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లాభిస్తాయి.నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.



