గుండెపోటుకు సంబంధించి పురుషులు, స్త్రీలల్లో లక్షణాల్లో స్వల్పంగా తేడాలుండవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవల కాలంలో చాలా మంది మహిళలు గుండె జబ్బులు, స్ట్రోక్‌ల బారిన పడుతున్నారు. దీనికి కారణం జీవనశైలిలో మార్పులు, జన్యు లోపాలు కారణం కావొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొన్నిసార్లు ఆరోగ్యంగా, ఫిట్‌గా కనిపించే మహిళలు కూడా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. హార్మోన్ల అసమతుల్యత దీనికి ప్రధాన కారణమని కార్డియాలజిస్టులు చెబుతున్నారు. హార్ట్ స్ట్రోక్ వచ్చే ముందు స్త్రీలలో కనిపించే లక్షణాలు ఏంటో తెలుసుకుందాం.