Health: మీరు కూడా ఈ పొరపాటు చేస్తున్నారా.? అయితే ఆరోగ్యం అంతే..

ఆహారాన్ని వేడి చేసుకోవడం మనలో చాలా మంది చేసే పనే. ముఖ్యంగా చల్లారిన కూరలను వేడి చేసికొని తింటుంటాం. అయితే ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని రకాల ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో వేడి చేసుకొని తినకూడదు. ఇంతకీ ఆ ఫుడ్‌ ఏంటంటే..

Narender Vaitla

|

Updated on: Jul 24, 2023 | 7:10 AM

పాలకూరను ఎట్టి పరిస్థితుల్లో వేడి చేసుకొని తినకూడదు. పాలకూరలో ఉండే నైట్రేట్లు.. కూరను పదే పదే వేడి చేయడం వల్ల అవి నైట్రోసమైన్లుగా మారుతాయి. వీటిని క్యాన్సర్‌కు కారకాలుగా చెబుతారు. అందుకే పాలకూరతో చేసిన ఏ వంటకానైన్నా వేడి చేసి తికూడదని నిపుణులు చెబుతున్నారు.

1 / 5
పదే పదే వేడి చేసుకోకూడదని మరో ఆహార పదార్థం గుడ్లు. ఉడికిన లేదా వేయించిన గుడ్లను రెండోసారి ఎట్టి పరస్థితుల్లో వేడి చేయకూడదు. వీటిలో నైట్రోజన్‌ అధికంగా ఉంటుంది. దీనిని పదే పదే వేడి చేయడం వల్ల క్యాన్సర్‌కు కారకంగా మారే అవకాశాలు ఉంటాయి.

2 / 5
బీట్‌రూట్ ఆరోగ్యానికి చాలా మంచిదనే విషయం తెలిసిందే. బీట్రూట్ తీసుకుంటే రక్తం పెరుగుతుంది. అయితే బీట్‌రూట్‌ను పదే పదే వేడి చేయడం వల్ల అనారోగ్యం కొని తెచ్చుకోవడమే అవుతుంది. బీట్‌రూట్‌ను పదే పదే వేడి చేస్తే ట్యాక్సిన్‌లు ఏర్పడతాయి.

3 / 5
పుట్టగొడుగులను పదే పదే వేడి చేసుకొని తింటే జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా కడుపు నొప్పి వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.

4 / 5
సాధారణంగా మనమంతా వేడి చేసుకొని తినే ఆహార పదార్థాల్లో చికెన్‌ కూడా ఒకటి. అయితే చికెన్‌ పదే పదే వేడి చేస్తే అందులోని ప్రోటీన్‌ నాశనమవుతుంది. అంతేకాకుండా జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

5 / 5
Follow us