రాహువు సంచారం : అపరకుభేరులయ్యే రాశుల వారు వీరే!
రాహువు సంచారంతో నాలుగు రాశుల వారికి అదృష్టం కలిసి రానున్నది. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఉండే ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక గ్రహాల్లో రాహువు గ్రహం ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచారం చేయాలంటే, ఒకటిన్నర సంవత్సరం పడుతుందంట. ఈ గ్రహం మంచి స్థానంలో ఉంటే ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.
Updated on: Jul 20, 2025 | 9:19 PM

అయితే శక్తివంతమైన గ్రహాల్లో రాహువు గ్రహం ఒకటి. ఇది ఒక వ్యక్తి జీవితంపై కీలక పాత్రపోషిస్తుంటుంది. రాహువు శుభ స్థానంలో ఉంటే ఆ వ్యక్తి జీవితానికి తిరుగే ఉండదు. అయితే రాహువు గ్రహం నేడు పూర్వభాద్ర నక్షత్రంలోకి సంచారం చేయనుంది. దీని వలన నాలు రాశుల వారి జీవితాల్లో కీలక మలుపు చోటు చేసుకుంటుంది. వీరు అపరకుభేరులు అవుతారు. ఇంతకీ ఆ రాశుల వారు ఎవరంటే?

కుంభ రాశి : కుంభ రాశి వారికి రాహువు అనుగ్రహం ఉంటుంది. రాహువు గ్రహం నక్షత్రాన్ని మార్చుకోవడం వలన వీరికి పట్టిందల్లా బంగారమే కానుంది. అంతే కాకుండా ఆర్థికంగా, ఆరోగ్య పరంగా చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఇంట్లో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఆర్థికంగా అద్భుతంగా ఉండబోతుంది.

ధనస్సు రాశి : ఈరాశి వారికి రాహువు గ్రహం నక్షత్ర సంచారం వలన పనుల్లో విజయం వరిస్తుంది. ఇంటిలోపల ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.ఈ రాశి వైవాహిక జీవితంలో ఆనందం నెలకొంటుంది. ఉద్యోగ, వ్యాపారల్లో పురోగతి కనిపిస్తుంది. ప్రమోషన్స్ పొందే ఛాన్స్ ఉంటుంది. పాతబాకీలు తీర్చేస్తారు.

వృషభ రాశి : ఈ రాశి వారికి ఏపని చేసినా కలిసి వస్తుంది. రాహువు గ్రహ సంచారం వీరి జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకొస్తుంది. ఇంటా బయటసానుకూల వాతావరణం ఏర్పడుతుంది. చాలా రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు దాని నుంచి బయటపడుతారు. దూరపు బంధువుల నుంచి అందే ఓ వార్త ఇంటిలో అందరి ఆనందానికి కారణం అవుతుంది. చేపట్టిన ప్రతి పనులు త్వరితగతిన పూర్తి అవుతాయి.

సింహ రాశి : ఈ రాశి వారికి రాహువు గ్రహం నక్షత్ర సంచారంతో పట్టిందల్లా బంగారమే కానుంది. ఆర్థికరంగా కలిసి వస్తుంది.. విద్యార్థులకు, వ్యాపారస్తులకు అనేక లాభాలు వస్తుంటాయి. చేపట్టిన పనుల్లోవిజయం అందుకుంటారు. విదేశీ ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. రియలెస్టేట్ రంగంలో ఉన్నవారు అధికలాభాలను పొందుతారు.



