బంగారం కంటే వేగంగా వెండి పరుగులు.. అత్యధిక వెండి నిల్వలు కలిగిన దేశాలు ఏవో తెలుసా?
వెండి అత్యంత విలువైన లోహాలలో ఒకటిగా మారిపోయింది. దాని అందం, పారిశ్రామిక అనువర్తనాలు, ఎలక్ట్రానిక్స్ కోసం ఇది ఎంతో విలువైనది. అత్యధిక వెండి నిల్వలు ఉన్న దేశాలు ఆర్థికంగా బలంగా ఉండటమే కాకుండా ప్రపంచ మార్కెట్లలో కూడా బలమైన ప్రభావాన్ని చూపుతాయి. ప్రపంచంలోనే అతిపెద్ద వెండి ఉత్పత్తి చేసే దేశాల గురించి తెలుసుకుందాం.
Updated on: Oct 08, 2025 | 8:17 PM

వెండి ధర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా భారీగా పెరుగుతుంది. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి చూస్తే.. వెండి ధర భారీగా పెరిగిపోయింది. గడచిన నెల రోజులుగా గమనించినట్లయితే వెండి ధర ప్రతిరోజు పెరగడం కనిపించింది. గత ఏడాది కేవలం 80 వేల రూపాయల పలికిన ఒక కేజీ వెండి ధర ఏకంగా ప్రస్తుతం 1.50 లక్షల రూపాయలకు చేరుకుంది. దీంతో వెండి లో పెట్టుబడి పెట్టిన వారికి భారీగా లాభాలు లభించాయని చెప్పాలి. నిజానికి వెండి ధర పెరుగుదల చూసినట్లయితే బంగారం కన్నా మంచి రాబడి చూపించింది. ఈ సంవత్సరంలో 60% కంటే ఎక్కువ లాభాన్ని నమోదు చేసింది. నిపుణులు వెండి ధర ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

వెండి అత్యంత విలువైన లోహాలలో ఒకటిగా మారిపోయింది. దాని అందం, పారిశ్రామిక అనువర్తనాలు, ఎలక్ట్రానిక్స్ కోసం ఇది ఎంతో విలువైనది. అత్యధిక వెండి నిల్వలు ఉన్న దేశాలు ఆర్థికంగా బలంగా ఉండటమే కాకుండా ప్రపంచ మార్కెట్లలో కూడా బలమైన ప్రభావాన్ని చూపుతాయి. ప్రపంచంలోనే అతిపెద్ద వెండి ఉత్పత్తి చేసే దేశాల గురించి తెలుసుకుందాం.

పెరూలో 140,000 మెట్రిక్ టన్నుల వెండి నిల్వలు ఉన్నాయని అంచనా. ఇది దేశాన్ని వెండి తవ్వకాలలో ప్రపంచ అగ్రగామిగా నిలిపింది. హువారి ప్రావిన్స్‌లోని అంటమినా గని పెరూలో ఏ ఇతర గని కంటే ఎక్కువ వెండిని ఉత్పత్తి చేస్తుంది. వెండి తవ్వకం పెరూ ఆర్థిక వ్యవస్థను గణనీయంగా బలపరుస్తుంది. ఆర్థిక వ్యవస్థలో ఒక ప్రధాన భాగంగా వెండి నిలిచింది.

ఈ జాబితాలో రష్యా రెండవ స్థానంలో ఉంది. 92,000 మెట్రిక్ టన్నుల వెండి నిల్వలతో రష్యా రెండో స్థానంలో నిలిచింది. భౌగోళిక రాజకీయ సవాళ్లు, అంతర్జాతీయ ఆంక్షలు ఉన్నప్పటికీ, ప్రపంచ వెండి మార్కెట్లో రష్యా ప్రధాన పాత్ర పోషిస్తోంది. దాని వెండి వ్యాపారం దేశీయ ఉత్పత్తి, ఎగుమతి స్థాయిలను స్థిరంగా ఉంచడానికి గణనీయంగా సహాయపడుతుంది. ఎందుకంటే మైనింగ్ కార్యకలాపాలు సైబీరియన్, ఉరల్ ప్రాంతాలలో కొనసాగుతున్నాయి.

72,000 మెట్రిక్ టన్నుల వెండి నిల్వలతో చైనా మూడవ స్థానంలో ఉంది. దేశంలో అతిపెద్ద ప్రాథమిక వెండి ఉత్పత్తి హెనాన్ ప్రావిన్స్‌లోని యింగ్ మైనింగ్ ప్రాంతం నుండి వస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా, వ్యూహాత్మక పెట్టుబడులు, పెద్ద ఎత్తున మైనింగ్ ద్వారా చైనా వెండి, ఇతర ముఖ్యమైన ఖనిజ రంగాలలో తన స్థానాన్ని బలోపేతం చేసుకుంది.

ఈ జాబితాలో పోలాండ్ నాల్గవ స్థానంలో ఉంది. దాని వెండి నిల్వలు 61,000 మెట్రిక్ టన్నులుగా అంచనా. ఈ దేశ వెండి పరిశ్రమకు వెన్నెముక KGHM, ఇది ప్రభుత్వ నియంత్రణలో ఉన్న రాగి, వెండి ఉత్పత్తిదారు. ఇది అంతర్జాతీయ గుర్తింపును సాధించింది.

ఈ జాబితాలో మెక్సికో 37,000 మెట్రిక్ టన్నుల వెండి నిల్వలతో ఐదవ స్థానంలో ఉంది. జకాటెకాస్‌లోని న్యూమాంట్ పెనాస్క్‌వోటో గని మెక్సికోలో రెండవ అతిపెద్దది. అంతే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఐదవ అతిపెద్దది కూడా.

అర్జెంటీనా సైతం గణనీయమైన వెండి నిల్వలను సొంతం చేసుకుంది. 28,000 మెట్రిక్ టన్నుల తో ఏడో స్థానంలో నిలిచింది. ఇది పెరుగుతున్న మైనింగ్ కార్యకలాపాలు, విలువైన లోహాలలో పెట్టుబడులను ప్రతిబింబిస్తుంది. వెండి మార్కెట్లలో దాని పాత్ర క్రమంగా విస్తరిస్తోంది.

ఆస్ట్రేలియాలో 27,000 మెట్రిక్ టన్నులు, చిలీలో 26,000 మెట్రిక్ టన్నులు, యునైటెడ్ స్టేట్స్‌లో 23,000 మెట్రిక్ టన్నులు, బొలీవియాలో 22,000 మెట్రిక్ టన్నులు, భారతదేశం 8,000 మెట్రిక్ టన్నులు వెండి నిల్వలు కలిగి ఉన్న అనేక ఇతర దేశాలు ఉన్నాయి.




