- Telugu News Photo Gallery These are the things that should be offered to the Shiva Lingam on the day of Naga Panchami
త్వరగా అప్పులు తీరిపోవాలా.. నాగపంచమి రోజు శివలింగానికి ఇవి సమర్పించండి!
నాగ పంచమి వచ్చేస్తుంది. ఈ సంవత్సరం జూలై 29న ప్రతి ఒక్కరూ నాగ పంచమిని జరుపుకుంటారు. నాగుల చవితి రోజున పుట్టలో పాలు పోడం చాలా మంచిదని చెబుతారు పండితులు. అయితే ఈ రోజున శివలింగాన్ని పూజించడం కూడా శుభప్రదం. నాగపంచమి రోజున శివలింగానికి ఈ వస్తువులు సమర్పించడం వలన అప్పుల సమస్యల నుంచి బయటపడుతారంట. కాగా, దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.
Updated on: Jul 26, 2025 | 8:07 PM

హిందూ సంప్రదాయంలో నాగుల చవితి పండుకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈరోజున ప్రతి ఒక్కరూ పుట్టలో పాలు పోసి, ఉపవాసాలు ఉంటూ, నాగదేవతను నిష్టగా పూజించుకుంటారు. అయితే ఈ రోజున శివలింగానికి కొన్ని రకాల వస్తువులు సమర్పించడం చాలా శ్రేయస్కరంమంట. దీని వలన రుణ విముక్తి లభించడమే కాకుండా, మానసిక ప్రశాంతత కూడా కలుగుతుందంట.

శ్రావణ మాసంలోని శుక్ల పక్షంలోని ఐదవ రోజున నాగ పంచమి పండుగ జరుపుకుంటారు. అయితే ఈ సారి జూలై 29న ఈ పండుగ వచ్చింది. ఈ రోజు నాగదేవతను పూజించి, శివుడి ఆశీస్సులు పొందుతారు. దీని వలన కాలసర్పదోషం నుంచి విముక్తి లభిస్తుంది. అయితే అప్పులు తీరాలి అంటే ఈ రోజు శివలింగానికి , గంగాజలం, నల్ల నువ్వులు, తేనె వంటివి సమర్పించాలంట.

శివుడికి తేనె, గంగా జలం చాలా ఇష్టం అందువలన నాగపంచమి రోజున శివలింగానికి తేనె, గంగా జలం సమర్పించడం వలన రుణసమస్యల నుంచి విముక్తి లభిస్తుందని,అలాగే మానసిక ప్రశాంతత కలుగుతుందని చెబుతున్నారు పండితులు.

అంతే కాకుండా శివుని పూజలో నల్ల నువ్వులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని భావిస్తారు. అటువంటి పరిస్థితిలో, నాగ పంచమి రోజున శివుడికి నల్ల నువ్వులు సమర్పించడం వల్ల జీవితంలోని అనేక అడ్డంకులు తొలగిపోతాయి,ర్థిక పురోగతి కూడా వస్తుందంట.

అలాగే శివుడికి నెయ్యి, చెరుకు రసం అంటే చాలా ఇష్టం అంట. అందువలన నాగపంచమి రోజున శివలింగానికి నెయ్యి, చెరుకు రసం సమర్పించడం చాలా మంచిదని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.



