Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heat wave: ఎండలో బయటకు వెళ్తున్నారా.? అయితే ఈ జాగ్రత్తలు కచ్చితంగా పాటించండి.

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఎండలో కాసేపు అలా బటయకు వెళ్తేనే చుక్కలు కనిపించే పరిస్థితి నెలకొంది. ఎండలు భారీగా ఉన్న నేపథ్యంలో అధికారులు కీలక సూచనలు చేశారు. మండె ఎండల వల్ల అనారోగ్యం బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు..

Narender Vaitla

|

Updated on: Apr 17, 2023 | 4:26 PM

ఎండలు దంచికొడుతున్నాయి. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగ భగలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. మధ్యాహ్నం రోడ్డుపైకి వెళ్లాలంటే చుక్కలు కనిపించే పరిస్థితి ఉంది. అయితే కొన్ని సందర్భాల్లో కచ్చితంగా యబటకు వెళ్లా్ల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

1 / 6
Heatwave

Heatwave

2 / 6
వడదెబ్బకు గురైన వారు సాధారణ స్థితికి రాకపోతే వెంటనే దగ్గర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించండి. ఎండలో నుంచి వచ్చిన వెంటనే నీరు లేదా నిమ్మరసం, కొబ్బరి నీరు తాగాలి. తీవ్రమైన ఎండలో బయటికి వెళ్లినప్పుడు తలతిరగడం, వాంతులు ఇతర అనారోగ్య సమస్యలు ఏర్పడితే వెంటనే దగ్గరల్లోని వైద్యున్ని సంప్రదించాలి.

3 / 6
ఇంటి వాతావరణం చల్లగా ఉంచుకోండి. ఫ్యాను వాడండి. చల్లని నీరుతో స్నానం చేయండి. తక్కువ ఖర్చుతో కూడిన చల్లదనం కోసం ఇంటిపై కప్పులపై వైట్ పెయింట్, కూల్ రూఫ్ టెక్నాలజీ, క్రాస్ వెంటిలేషన్, థర్మోకోల్ ఇన్సులేషన్ ను ఉపయోగించండి. మేడపైన మొక్కలు, ఇంట్లో ని  మొక్కలు (ఇండోర్ ప్లాంట్స్)  భవనాన్ని చల్లగా ఉంచుతాయి. అదేవిదంగా ఉష్ణతాపాన్ని తగ్గిస్తాయి. ఎండలో  గొడుగు లేకుండా తిరగరాదు. వేసవి కాలంలో  నలుపురంగు,మందంగా ఉండే దుస్తులు ధరించరాదు.

4 / 6
మధ్యాహ్నం తరువాత (మధ్యాహ్నం 12గంటల నుంచి సాయంత్రం 3గంటల మధ్యకాలంలో) బయట ఎక్కువ శారీరక శ్రమతో కూడిన పనిచేయకూడదు. బాలింతలు,చిన్నపిల్లలు, వృద్దులు ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బయట తిరగొద్దు. వీరిపై ఎండ ప్రభావం త్వరగా చూపే అవకాశం ఉంది. శరీరాన్ని డీహైడ్రేట్ చేసే ఆల్కహాల్, టీ, కాఫీ, కూల్‌ డ్రింక్స్‌ జోలికి వెళ్లకండి. అధిక ప్రోటీన్, ఉప్ప, కారం, నూనె ఉండే  పదార్దాలకు దూరంగా ఉండండి.

5 / 6
Heatwave

Heatwave

6 / 6
Follow us