Dinner Mistakes: డిన్నర్ విషయంలో ఈ తప్పులు చేస్తే బరువు పెరగడం ఖాయం.. బీపీ, గుండె పోటు ప్రమాదం కూడా..!
Dinner Mistakes: చాలా మంది బరువు పెరిగిపోతామనే కారణంతో రాత్రి పూట భోజనమే చేయరు. అలాగే చేసిన రోజు చాలా హెవీగా తింటుంటారు. అలాగే భోజనానికి సమయపాలన లేకుండా తింటారు. ఇలాంటి చిన్న చిన్న తప్పులే ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతాయి. ఇంకా మీరు అనూహ్యంగా బరువు పెరిగేలా చేస్తాయి. ముఖ్యంగా రాత్రి వేళలో మీరు తెలిసీతెలియక చేసే కొన్ని తప్పులు మీరు బరువు పెరిగేలా చేస్తాయి. అవేమింటే..?
Updated on: Aug 05, 2023 | 7:03 PM

Dinner Mistakes: నిపుణులు ప్రకారం పడుకోవడానికి కనీసం ఒకటిన్నర నుంచి రెండు గంటల ముందే భోజనం తీసుకుంటే జీర్ణవ్యవస్థపై ఒత్తిడి ఉండదు. మనం నిద్రలో ఉన్నప్పుడు శరీర జీర్ణవ్యవస్థ పనితీరు నెమ్మదిస్తుంది. ఈ క్రమంలో మీరు నిద్రించే సమయానికి కొన్ని నిముషాల ముందు లేదా గంట లోపు తిన్నారంటే.. ఆహారం జీర్ణం కాదు. అలా జీర్ణం కాని ఆహారంలో శరీరంలో కొవ్వు రూపంలో మిగిలిపోయి మీరు బరువు పెరిగేలా చేస్తుంది.

రాత్రి భోజనంలో వీలైనంత తేలికపాటి ఆహారాన్నే తీసుకోవడం మంచిది. తేలికపాటి ఆహారం త్వరగా జీర్ణమై శరీరానికి శక్తిని అందిస్తుంది. అలా కాకుండా హెవీ ఫుడ్ తీసుకుంటే అది జీర్ణం కాక మీరు బరువు పెరిగేందుకు దారితీస్తుంది.

రాత్రి సమయంలో తీసుకునే భోజనంలో సరిపడినంతా పోషకాలు ఉండేలా జాగ్రత్త తీసుకోండి. సంపూర్ణమైన ఆరోగ్యం కోసం పోషకాహారం చాలా ముఖ్యం.

చాలా మంది రాత్రి పూట భోజనం తర్వాత తీపి తింటారు. తీయని పదార్థాల్లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఫలితంగా మీరు బరువు పెరిగే ప్రమాదం ఉంది.

అలాగే మీరు తినే ఆహారంలో ఉప్పు పరిమితంగా ఉండేలా జాగ్రత్త పడాలి. ఉప్పు తక్కువైనా, ఎక్కువైనా మీ బీపీ లెవెల్స్‌లో మార్పులు వచ్చి, గుండెపోటుకు దారితీస్తుంది.





























