Camphor: కర్పూరం వాసనతోనే ఇన్ని మార్పులు జరుగుతాయా..
కర్పూరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతీ ఒక్కరి పూజ గదిలో ఉండే వస్తువుల్లో ఇది కూడా ఒకటి. కర్పూరాన్ని చాలా మంది పూజకు మాత్రమే ఉపయోగిస్తారు అనుకుంటారు. కానీ కర్పూరంతో చర్మ, జుట్టు సమస్యలు, ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరచుకోవచ్చు. కర్పూరం వాసన చూసినా కూడా కొన్ని సమస్యలు మాయం అవుతాయి. కర్పూరం వాసన చూస్తే తలనొప్పిని తగ్గించుకోవచ్చు. కర్పూరం నుంచి వచ్చే వాసన ఘాటుగా ఉంటుంది. దీంతో మెదడులోని కణాలు యాక్టివ్..
Updated on: Sep 26, 2024 | 1:04 PM

కర్పూరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతీ ఒక్కరి పూజ గదిలో ఉండే వస్తువుల్లో ఇది కూడా ఒకటి. కర్పూరాన్ని చాలా మంది పూజకు మాత్రమే ఉపయోగిస్తారు అనుకుంటారు. కానీ కర్పూరంతో చర్మ, జుట్టు సమస్యలు, ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరచుకోవచ్చు. కర్పూరం వాసన చూసినా కూడా కొన్ని సమస్యలు మాయం అవుతాయి.

కర్పూరం వాసన చూస్తే తలనొప్పిని తగ్గించుకోవచ్చు. కర్పూరం నుంచి వచ్చే వాసన ఘాటుగా ఉంటుంది. దీంతో మెదడులోని కణాలు యాక్టివ్ అవుతాయి. దీంతో తలనొప్పి తగ్గుతుంది. మీకు తలనొప్పిగా ఉన్నప్పుడు కర్పూరం వాసన చూస్తే సరిపోతుంది.

కర్పూరం వాసన చూడటం వల్ల జీర్ణ క్రియ కూడా మెరుగు పడుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడేవారు కర్పూరం వాసన చూస్తే సరిపోతుంది. దీని వాసనను రెగ్యులర్‌గా చూస్తే గ్యాస్, అసిడిటీ, అజీర్తి సమస్యలు తగ్గుతాయి.

చాలా మంది రోజూ పూజ చేసే సమయంలో కర్పూరాన్ని ఉపయోగిస్తుంటారు. దీన్ని ఉపయోగించడం వల్ల గాలిలోని బ్యాక్టీరియా తొలగిపోయి, స్వచ్ఛంగా మారుతుంది. అంతే కాకుండా ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీని దూరం చేసి పాజిటివ్‌టివిటీని తీసుకువస్తుందని కూడా చాలా మంది నమ్ముతారు.

కర్పూరం వాసన చూడటం వల్ల శరీరంలో ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. శరీరంలోని కణాలు యాక్టివ్ అవుతాయి. దీంతో పాజిటివ్ శక్తి నెలకొంటుంది. కర్పూరం వినియోగించడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)




