- Telugu News Photo Gallery The use of pepper powder not only keeps the brain healthy but also prevents forgetfulness, check details in Telugu
Pepper for Brain: ఇదొక్కటి వాడండి.. మెదడు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మతిమరుపు పోతుంది!
శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో మెదడు కూడా ఒకటి. మెదడు ఆరోగ్యంగా ఉంటేనే.. ఏ పని అయినా చేయగలం. శరీరంలో మిగిలిన భాగాలకు ఎప్పుడు ఏం చేయాలనేది ఆదేశాలు ఇస్తూ ఉంటుంది. మెదడు హెల్దీగా ఉంటేనే ఇతర శరీర భాగాలు కూడా సక్రమంగా పని చేస్తాయి. ఈ మధ్య చాలా మంది మతి మరుపు, అల్జీమర్స్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. ఇలాంటి రాకుండా ఉండాలే.. తీసుకునే ఆహారం, జీవనన శైలిలో మార్పులు..
Updated on: Feb 05, 2024 | 1:31 PM

శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో మెదడు కూడా ఒకటి. మెదడు ఆరోగ్యంగా ఉంటేనే.. ఏ పని అయినా చేయగలం. శరీరంలో మిగిలిన భాగాలకు ఎప్పుడు ఏం చేయాలనేది ఆదేశాలు ఇస్తూ ఉంటుంది. మెదడు హెల్దీగా ఉంటేనే ఇతర శరీర భాగాలు కూడా సక్రమంగా పని చేస్తాయి. ఈ మధ్య చాలా మంది మతి మరుపు, అల్జీమర్స్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు.

ఇలాంటి రాకుండా ఉండాలే.. తీసుకునే ఆహారం, జీవనన శైలిలో మార్పులు చేసుకోవాలి. తల్లి గర్బంలో ఉన్నప్పుడే మెదడు కణాల నిర్మాణం అనేద ప్రారంభమవుతుంది. మెదడు కణాలు ఒక్కసారి పుట్టాయంటే మరణించే వరకు అవే కణాలు ఉంటాయి. ఈ కణాలు ఒక్కసారి మరణిస్తే.. మరలా పుట్టడం జరగవు.

కాబట్టి ఈ మెదడు కణాలు చనిపోకుండా, వాటిలో ఇన్ ప్లామేషన్ రాకుండా చూసుకోవాలి. మెదడు కణాలు కనుక చనిపోతూ ఉంటే చాలా నష్టం జరుగుతుంది. బ్రెయిన్‌లో కొన్ని రకాల హానికర ప్రోటీన్లు రిలీజ్ అయి మెదడు కణాలను నశింపజేస్తూ ఉంటాయి. ఇలాంటి వాటి నుంచి మెదడు కణాలను కాపాడాలంటే.. మిరియాలు చక్కగా పని చేస్తాయి.

మిరియాల్లో పెప్పరిన్ ఉంటుంది. ఇది బ్రెయిన్ కణాలను నాశనం చేసే ప్రోటీన్‌ను నశింపజేసి మెదడు ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయ పడుతుందని నిపుణులు చెబుతున్నారు. మతిమరుపు, డిమెన్షియా వంటికి రాకుండా చూస్తుంది.

వంటల్లో కారానికి బదులుగా మిరియాలను వాడటం ఉత్తమం. అలాగే సలాడ్స్, సూప్స్, స్నాక్స్ వంటి వాటిల్లో మిరియాల పొడిని వాడటం వల్ల మెదడు కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. అయితే మరీ ఎక్కువగా కాకుండా మితంగా ఉపయోగించండి.




