- Telugu News Photo Gallery The story of that hijack when neerja bhanot saved the lives of 360 passengers by sacrificing her life
Neerja Bhanot: ఉగ్రవాదుల నుంచి 360 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడి పుట్టిన రోజునే ప్రాణాలను పోగొట్టుకున్న నీర్జా.. నీ త్యాగం మరువలేనిది..
5 సెప్టెంబర్ 1986న, PAN AM 73 విమానం ముంబై నుండి బయలుదేరింది. విమానం న్యూయార్క్‌కు వెళ్లాల్సి ఉంది. అయితే పాకిస్తాన్‌లోని కరాచీ నగరం ఈ ప్లైట్ మొదటి స్టాప్. కరాచీలోని జిన్నా విమానాశ్రయంలో విమానం దిగింది. కొంతమంది ప్రయాణికులు దిగి, మరికొందరు ప్రయాణానికి ఎక్కారు. పైలట్ టేకాఫ్ కోసం సన్నాహాలు ప్రారంభించాడు. ఇంతలో నలుగురు ఉగ్రవాదులు అకస్మాత్తుగా విమానంలోకి ప్రవేశించారు. విమానంలోని ప్రయాణీకులకు, సిబ్బందికి ఏమి జరిగిందో తెలిసేలోగా క్షణాల్లో ఉగ్రవాదులు విమానాన్ని హైజాక్ చేశారు.
Updated on: Sep 07, 2023 | 12:30 PM

విమానంలో నలుగురు ఉగ్రవాదులు, 360 మంది ప్రయాణికులు, సిబ్బంది సహా 379 మంది ఉన్నారు. ఈ సిబ్బందిలో నీర్జా భానోత్ ఒకరు. 22 ఏళ్ల ఎయిర్ హోస్టెస్ నీరజా భానోత్ 360 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడింది. ఆమె ధైర్యసాహసాలను త్యాగాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం నీర్జా కు అశోకచక్ర పురస్కారాన్ని ప్రధానం చేసింది.

భారతదేశపు అశోకచక్రాన్ని పొందిన అతి పిన్న వయస్కురాలు. నీరజా భానోత్ ధైర్యసాహసాలకు అమెరికన్ మీడియా కూడా ముగ్దుడైంది. అంతేకాదు తమ మీడియా హెడ్‌లైన్స్‌లో నీర్జా కు హైజాక్ హీరోయిన్ అనే బిరుదునిచ్చింది. ప్లైట్ హైజాక్ జరిగిన సరిగ్గా రెండు రోజుల తర్వాత సెప్టెంబర్ 7న నీర్జా భానోత్ పుట్టినరోజు.

నీర్జా భానోత్ ఎవరంటే.. నీర్జా భానోత్ ఎయిర్ హోస్టెస్. ఆమె 7 సెప్టెంబర్ 1963న జన్మించింది. విమానం హైజాక్ జరిగిన తరవాత తన పుట్టిన రోజునే ఆమె ప్రయాణికుల ప్రాణాలను కాపాడుతూ అమరురాలైంది. ఆమె స్వస్థలం చండీగఢ్. ఆమెకు 1985 లో వివాహం జరిగింది.. భార్యాభర్తల మధ్య వచ్చిన వివాదంతో విడాకులు తీసుకుంది. తర్వాత అమెరికా వెళ్లి అక్కడ PAN AM కంపెనీలో ఎయిర్ హోస్టెస్‌గా మారింది. నీరజా మరణానంతరం భారత ప్రభుత్వం అత్యున్నత శాంతి పురస్కారమైన అశోక్ చక్రను ప్రధానం చేసింది. అమెరికా ప్రభుత్వం కూడా నీర్జా ను సత్కరించింది.

హైజాక్ జరిగిన రోజు ఏం జరిగిందంటే .. ఉగ్రవాదులు విమానంలోకి ప్రవేశించిన వెంటనే పైలట్, కో-పైలట్ పారిపోయారు. దీంతో విమానంలో సీనియర్ సిబ్బంది నీర్జా భానోత్ మాత్రమే. ఆమెకు కూడా పారిపోయే అవకాశం వచ్చింది. అయితే నీర్జా మాత్రం అలా చేయలేదు. ఉగ్రవాదులు అమెరికా పౌరుల కోసం వెతుకుతున్నారు. అమెరికా పౌరులను తీసుకురావాలని నీర్జా భానోత్‌ను కోరాడు. ఈ ఉగ్రవాదులు అబు నిదాన్ సంస్థకు చెందినవారు. నీరజా భానోత్ పాస్‌పోర్ట్‌లను సేకరించమని చెప్పాడు. దీంతో ఆమె అమెరికన్ పౌరుల పాస్‌పోర్ట్‌లను దాచిపెట్టి, మిగిలిన వాటిని ఉగ్రవాదులకు అప్పగించింది.

అమెరికావారు లేరని తెలిసి ఉగ్రవాదులకు పెరిగిన ఆగ్రహం .. విమానంలో అమెరికా ప్రయాణికులు ఎవరూ లేరని తెలుసుకున్న ఉగ్రవాదులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఉగ్రవాదులు 17 గంటల పాటు అధికారులతో మాట్లాడారు. అప్పటి వరకు ప్రయాణికులు ఊపిరి బిగబట్టి ఉన్నారు. విమానంలో కొంతమంది పిల్లలు కూడా ఉన్నారు. ప్రయాణీకుల ఆరోగ్యం నిరంతరం క్షీణిస్తోంది. నీర్జా భానోత్ అవకాశం దొరికిన వెంటనే ఆ పిల్లలను తీసుకుని ఎమర్జెన్సీ డోర్ వైపు పరుగెత్తింది. అది చూసిన ఉగ్రవాదులు చిన్నారులపైకి తుపాకులు గురిపెట్టారు.. నీర్జా పిల్లలకు ఎఅడ్డుగా నిలిచింది. దీంతో ఉగ్రవాదుల తూటాలు ఆమె శరీరంలో దూసుకుని వెళ్లాయి. తనకు గాయాలు అయినా ఆమె లెక్కచేయలేదు.. విమానం ఎమర్జెన్సీ డోర్ తెరిచింది.

ప్రయాణికులను రక్షించి తాను మరణించిన నీర్జా .. తన గాయాల నుంచి రక్తం కారుతున్నా ఎమర్జెన్సీ గేట్ నుండి ప్రయాణికులను బయటకు పంపిస్తూనే ఉంది. ఉగ్రవాదులు కూడా కాల్పులు ప్రారంభించారు. ఈ ఘటనలో 100 మందికి పైగా గాయపడ్డారు. 18-19 మంది మరణించారు, అయితే దాదాపు 360 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘర్షణలో ఉగ్రవాదులు పారిపోయారు. ఈ ఉగ్రవాదులు FBI హిట్‌లిస్ట్‌లో ఉన్నారు. వీరిపై US $ 5 మిలియన్ల రివార్డు ఉంది. అయితే ఈ ఉగ్రవాదులు పట్టుబడలేదు.





























