- Telugu News Photo Gallery The Benefits of eating Sesame Seeds in Winter Season, Check Here is Details
Sesame Seeds: శీతా కాలంలో నువ్వులు తింటే వచ్చే లాభాలు అన్నీ ఇన్నీ కావు..
నువ్వులు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. అందులోనూ చలి కాలంలో తీసుంటే ఆరోగ్యానికి మరింత మంచిది. ఇందులో ఉండే అనేక రకాల ఔషధ గుణాలు శరీరాన్ని హెల్దీగా ఉంచుతాయి..
Updated on: Dec 03, 2024 | 1:19 PM

నువ్వులను తీసుకోవడం వల్ల శరీరంలో రక్త ప్రవాహం క్రమబద్దీకరించబడుతుంది. ఇది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్యను పోగొట్టడానికి ప్రభావవంతంగా ఉంటుందని నిరూపించబడింది. నువ్వులు రుతుస్రావాన్ని ప్రేరేపిస్తాయి లేదా నియంత్రిస్తాయనే వాదనకు మద్దతు ఇవ్వడానికి శాస్త్రీయ ఆధారాలు లేవని నిపుణులు చెబుతున్నారు.

నువ్వుల్లో ఉండే పోషకాలు వింటర్ సీజన్‌లో వచ్చే అనారోగ్య సమస్యల నుంచి మిమ్మల్ని కాపడతాయి. బెల్లంతో కలిపి తింటే ఇక రోగాలు పరార్ అవుతాయి. శరీరంలో ఇమ్యూనిటీని పెంచడంలో నువ్వులు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఎంత తింటే అంత ఆరోగ్యానికి మంచిది.

ఎముకల బలానికి నువ్వులు మంచి ఔషధంగా పనిచేస్తాయి. బోన్ హెల్త్ కోసం పనిచేసే కాల్షియం సహా అనేక పోషకాలు ఈ నువ్వుల్లో ఉంటాయి. నువ్వుల్లో కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్, జింక్ పుష్కలంగా ఉంటాయి. ఐరన్, కాల్షియం, ఫైబర్ వంటి ముఖ్యమైన పోషకాలు నువ్వుల్లో లభిస్తాయి. మీరు క్రమరహిత రుతుచక్రం సమస్యను ఎదుర్కొంటుంటే.. దీని కోసం నిపుణులను సంప్రదించిన తర్వాత మాత్రమే నువ్వులను తినండి.

sesame seeds

యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్న నువ్వులు శరీరంలో హార్మోన్ల అసమతుల్యత సమస్యను పోగొట్టడానికి సహాయపడతాయి. నువ్వుల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీని సహాయంతో శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయి పెరుగుతుంది. అధిక స్థాయి ఈస్ట్రోజెన్ గర్భాశయం సంకోచాన్ని ప్రేరేపిస్తుంది.




