- Telugu News Photo Gallery Telangana govt has declared Dasara Holidays for schools from October 2nd to 14th, Know Andhra Pradesh dussehra 2024 holidays
Dussehra Holidays: ఇక పండగే పండగ.. గాంధీ జయంతి ప్లస్ దసరా సెలవులు.. మొత్తం ఎన్ని రోజులో తెలుసా..?
దసరా వచ్చేసింది.. సందడి తెచ్చేసింది.. అంతటా ఇక పండగ హాడావుడే.. ఇక చిన్నారులకు, విద్యార్థులకైతే.. ఇక బోలెడంత ఎంజాయ్‌మెంట్.. ఇక చెప్పే పనేలేదు.. స్కూళ్లకు వెళ్లే వారంతా ఈ సెలవుల కోసమే ఎదురుచూస్తుంటారు.. ఆ క్షణం రానే వచ్చింది..
Updated on: Oct 01, 2024 | 9:35 PM


తెలంగాణలో రేపటి నుంచి స్కూళ్లకు దసరా సెలవులు ప్రారంభమవుతాయని పేర్కొంది. అక్టోబర్ 02 నుంచి 14 వరకు దసర సెలవులు ప్రకటిస్తూ రాష్ట్ర విద్యాశాఖ సర్క్యూలర్ జారీ చేసింది. సెలవుల అనంతరం ఈనెల 15న పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి.

ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలలకు కూడా సెలవులు కచ్చితంగా ఇవ్వాలని ఆదేశాలిచ్చింది.. ఆదేశాలు పాటించకుంటే కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అకడమిక్ కాలెండర్ ప్రకారం యథావిధిగా సెలవులు ఇవ్వాలని విద్యాశాఖ పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్‌లో కూడా రేపటినుంచి సెలవులు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 2 గాంధీ జయంతి సెలవు ఉంటుంది.. అక్టోబర్ 3 నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. అక్టోబర్ 4 నుంచి సెలవులు ఇవ్వాల్సి ఉండగా.. ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు మంత్రి నారా లోకేష్ అక్టోబర్ 3 నుంచి 13 వరకు దసరా సెలవులు ప్రకటించారు. అక్టోబర్ 14 నుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభం కానున్నాయి.

కాగా తెలంగాణలో గాంధీ జయంతితో కలిపి.. తెలంగాణలో 13 రోజులు సెలవులు ఉండగా.. ఏపీలోని విద్యార్ధులకు 12 రోజుల పాటు దసరా సెలవులు ఉండనున్నాయి. దసరా సెలవుల నేపథ్యంలో పట్టణాల్లో ఉన్న వారంతా.. గ్రామాలకు వెళ్లి పండగను ఎంజాయ్ చేయనున్నారు..
