- Telugu News Photo Gallery Technology photos Vu launches new smart tv in india vu premium 32 inch smart tv have a look on features and price
Vu Premium Smart TV: భారత మార్కెట్లోకి వీయూ కొత్త స్మార్ట్ టీవీ.. రూ. 13 వేలకే 32 ఇంచెస్..
Vu Premium Smart TV: ప్రముఖ స్మార్ట్ టీవీల తయారీ కంపనీ వీయూ తాజాగా భారత మార్కెట్లోకి కొత్త టీవీని లాంచ్ చేసింది. తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే..
Updated on: Jan 29, 2022 | 12:00 PM

ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం వీయూ తాజాగా భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది. వీయూ ప్రిమీయం 32 ఇంచెస్ టీవీ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 12,999కి అందుబాటులో ఉంది.

ఈ స్మార్ట్‌టీవీలో 60 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేతో పాటు 20 వాట్ సౌండ్ అవుట్ పుట్‌ను అందించారు. డాల్బీ ఆడియో సపోర్ట్ ఈ స్మార్ట్ టీవీ స్పెషల్ ఫీచర్.

క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ స్మార్ట్ టీవీలో 1 జీబీ ర్యామ్, 4 జీబీ స్టోరేజ్‌ను అందించారు. ఈ టీవీ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుంది.

ఈ టీవీలో నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ మ్యూజిక్, బ్రౌజర్ యాప్స్, ఇంటర్నెట్ బ్రౌజర్ లాంటివి యాక్సెస్ చేయొచ్చు.

వ్యూ ఎనీవ్యూ క్యాస్ట్ ఫీచర్‌తో స్మార్ట్ ఫోన్‌లోని కంటెంట్‌ను టీవీలో చూడొచ్చు. ఇక టీవీనీ వెలుతురులో కూడా చూసేందుకు వీలుగా ఇందులో నైట్ మోడ్ ఫీచర్‌ను ప్రత్యేకంగా అందించారు.




