- Telugu News Photo Gallery Technology photos Tech News: Why is Refrigerator Not Cooling? Common Reasons
Refrigerator Cooling: మీరు ఈ పొరపాట్లు చేస్తున్నారా? ఫ్రిజ్ కూలింగ్ కాదు!
Refrigerator Cooling: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్రిజ్ ఉంటుంది. కూరగాయలు, పండ్లు, మాంసం వంటి ఆహార పదార్థాలు చెడిపోకుండా ఉండటానికి ప్రజలు ఈ ఫ్రిజ్‌ను ఉపయోగిస్తారు. ఫ్రిజ్‌లు చల్లని గాలిని విడుదల చేస్తాయి. ఆహార పదార్థాలు త్వరగా చెడిపోవు..
Updated on: Nov 12, 2025 | 1:35 PM

Refrigerator Cooling: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్రిజ్ ఉంటుంది. కూరగాయలు, పండ్లు, మాంసం వంటి ఆహార పదార్థాలు చెడిపోకుండా ఉండటానికి ప్రజలు ఈ ఫ్రిజ్‌ను ఉపయోగిస్తారు. ఫ్రిజ్‌లు చల్లని గాలిని విడుదల చేస్తాయి. ఆహార పదార్థాలు త్వరగా చెడిపోవు. సురక్షితంగా ఉంటాయి. ఈ పరిస్థితిలో చాలా మంది తమ ఫ్రిజ్ కూలింగ్ కావడం లేదని చెబుతుంటారు. ఫ్రిజ్ చల్లబడకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. కొన్ని తప్పులు చేయడం వల్ల ఫ్రిజ్ చల్లబడకుండా ఉండవచ్చని నిపుణులు అంటున్నారు. నిపుణులు తెలిపిన ప్రకారం..

బ్రిడ్జ్ గాస్కెట్: మీ ఫ్రిజ్ డోర్ గాస్కెట్‌లో చిన్న పగుళ్లు లేదా రంధ్రాలు ఉంటే, ఫ్రిజ్ సమానంగా చల్లబడదు. ఎక్కువ విద్యుత్తును ఉపయోగిస్తుంది. దీని వల్ల కూలింగ్ అయ్యేందుకు సమయం పడుతుంది. అంతేకాదు విద్యుత్ బిల్లు కూడా పెరిగిపోతుంది.

ఫ్రిజ్ డోర్ సరిగ్గా వేయకపోవడం: రిఫ్రిజిరేటర్ డోర్స్ సరిగ్గా వేయకపోవడం వల్ల రిఫ్రిజిరేటర్ సమస్యలు తలెత్తుతాయి. అంటే రిఫ్రిజిరేటర్ తలుపులు సరిగ్గా మూసివేయకపోతే కూలింగ్ శక్తిని ఉత్పత్తి చేయడానికి ఎక్కువ శక్తి ఖర్చవుతుంది. దీని కారణంగా రిఫ్రిజిరేటర్ చాలా త్వరగా పాడైపోతుంది.

ఉష్ణోగ్రతను తనిఖీ చేయండి: మీ రిఫ్రిజిరేటర్ సరైన ఉష్ణోగ్రత వద్ద ఉందో లేదో తనిఖీ చేయడం ముఖ్యం. అంటే, రిఫ్రిజిరేటర్ ఉష్ణోగ్రత 4 డిగ్రీల సెల్సియస్, ఫ్రీజర్ ఉష్ణోగ్రత 0 డిగ్రీల సెల్సియస్ అని నిర్ధారించుకోండి.

ఎక్కువ వస్తువులు ఉంచకండి: చాలా మంది అన్ని వస్తువులను తీసుకొని ఫ్రిజ్‌లో పేర్చుతారు. దీనివల్ల ఫ్రిజ్ కూలింగ్ సామర్థ్యం తగ్గే అవకాశం ఉంది. అందువల్ల ఫ్రిజ్‌లో వస్తువులను ఉంచేటప్పుడు, వాటిని ఒకే చోట ఉంచకూడదు. వాటిని దూరంగా ఉంచండి. అప్పుడే శీతలీకరణ సామర్థ్యం అన్ని వస్తువులకు సమానంగా చేరుతుంది.

ఐస్‌ను తొలగించండి: ఫ్రిజ్ ఫ్రీజర్ నుండి గట్టి ఐస్‌ను క్రమానుగతంగా తొలగించడం చాలా ముఖ్యం, ఎందుకంటే గట్టి మంచు సులభంగా ఫ్రిజ్‌ను దెబ్బతీస్తుంది.




