- Telugu News Photo Gallery Technology photos Super smart features in those smartphones, These are the best phones, Smartphones Under 20K details in telugu
Smartphones Under 20K: ఆ స్మార్ట్‌ఫోన్స్‌లో సూపర్ స్మార్ట్ ఫీచర్లు.. ది బెస్ట్ ఫోన్స్ ఇవే..!
ప్రస్తుత రోజుల్లో పెరిగిన ఖర్చుల నేపథ్యంలో అన్ని రకాల వస్తువుల బడ్జెట్‌లోనే ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ముఖ్యంగా భారతదేశంలో మధ్య తరగతి ఉద్యోగులు ఎక్కువ. ఈ నేపథ్యంలో ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు కూడా భారతదేశంలో బడ్జెట్ ధరల్లోనే సూపర్ స్మార్ట్ ఫీచర్స్‌తో స్మార్ట్ ఫోన్లు లాంచ్ చేస్తున్నాయి. మెరుగైన పనితీరుతో మంచి డిజైన్‌లు, శక్తివంతమైన ప్రాసెసర్‌లు, అద్భుతమైన డిస్‌ప్లేల ఈ స్మార్ట్ ఫోన్లు సొంతం. అయితే తక్కువ ధర అయినా నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా ఈ స్మార్ట్ ఫోన్లు యువతను ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రూ.20 వేల లోపు మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ది బెస్ట్ ఫోన్స్ గురించి తెలుసుకుందాం.
Updated on: Jul 11, 2024 | 5:15 PM

సామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్34 5జీ ఫోన్‌కూడా మిస్టిక్ గ్రీన్ కలర్‌లో అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా 50 ఎంపీ నో షేక్ కెమెరా, ఆటో నైట్ మోడ్‌తో అద్భుతమైన ఫోటోలు, వీడియోలను ఈ ఫోన్ ద్వారా క్యాప్చర్ చేయవచ్చు. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 హెచ్‌జెడ్ ఎమోఎల్ఈడీఅ డిస్‌ప్లేతో వచ్చే ఈ ఫోన్ ద్వారా సిల్కీ-స్మూత్ అనుభవాన్ని ఆశ్వాదించవచ్చు. డాల్బీ అట్మాస్ సౌండ్, గొరిల్లా గ్లాస్ 5 ఫీచర్లు మల్టీమీడియా అడ్వెంచర్‌లకు ప్రీమియం టచ్‌ని జోడిస్తాయి. 8 జీబీ + 128 జీబీ వేరియంట్‌లో అందుబాటులో ఉండే ఈ ఫోన్ ధర రూ.17,490గా ఉంది.

పాస్టెల్ లైమ్ కలర్‌లో అందుబాటులో ఉండే వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5 జీ ఫోన్ 8 జీబీ + 128 జీబీ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది. ఆక్సిజన్ ఓఎస్ ఆధారంగా పని చేసే ఈ ఫోన్‌లో 2 ఎంపీ డెప్త్-అసిస్ట్, మాక్రో లెన్స్‌లతో పాటు 16 ఎంపీ సెల్ఫీ కెమెరాతో 108 ఎంపీ ప్రధాన కెమెరాతో అద్భుతమైన ఫోటోలను క్యాప్చర్ చేయవచ్చు. 120 హెచ్‌జెడ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో శక్తివంతమైన 6.72 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను ఈ ఫోన్ ప్రత్యేకత 67 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో పని చేసే ఈ ఫోన్ ధర రూ.17,636గా ఉంది.

శామ్‌సంగ్ గెలాక్సీ ఎం32ని బ్లాక్ కలర్‌లో యువతను అమితంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా పనితీరు విషయంలో రాజీ లేకుండా ఉండే ఈ ఫోన్ 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో అద్భుతమైన ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎస్ఎమోఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. గొరిల్లా గ్లాస్ 5 ద్వారా వచ్చే ఈ ఫోన్ 64 ఎంపీ క్వాడ్ కెమెరా సెటప్‌తో 20 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో ఆకర్షణగా ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.13,990గా ఉంది.

లావా అగ్ని 2 5జీ ఫోన్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌తో వస్తుంది. 8 జీబీ + 256 జీబీ వేరియంట్‌లో అందుబాటులో ఉండే ఈ ఫోన్ 120 హెచ్‌జెడ్ కర్వ్డ్ ఎమోఎల్ఈడీ డిస్‌ప్లేతో ఆకట్టుకుంటుంది. 50ఎంపీ క్వాడ్ కెమెరాతో పాటు సూపర్‌ఫాస్ట్ 66 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ ప్రత్యేకత. ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారంగా పని చేసే ఈ ఫోన్ ధర రూ.16999గా ఉంది.

వుడ్‌ల్యాండ్ గ్రీన్ కలర్‌లో అందుబాటులో ఉండే రియల్‌మీ 12 5జీ ముఖ్యంగా మహిళలను అధికంగా ఆకట్టుకుంటుంది. ఆకర్షణీయమైన డిజైన్, శక్తివంతమైన పనితీరుతో వచ్చే ఈ ఫోన్ 8 జీబీ + 128జీ స్టోరేజ్ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది. మల్టీ టాస్కింగ్ విషయంలో అధిక పనితీరు కనబరిచే ఈ ఫోన్‌లో 108 ఎంపీ 3 ఎక్స్ జూమ్ పోర్ట్రెయిట్ కెమెరాతో అద్భుతమైన ఫోటోలను క్యాప్చర్ చేయవచ్చు. 45 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌ను మద్దతును ఇచ్చే ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ ధర రూ.16020గా ఉంది.




