- Telugu News Photo Gallery Technology photos Samsung launches new earbuds galaxy buds 3 and galaxy buds 3 pro, Check here for more details
Galaxy Buds 3: సామ్‌సంగ్ నుంచి కొత్త ఇయర్ బడ్స్.. ఏఐ ఫీచర్లతో..
సౌత్ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం మార్కెట్లోకి కొత్త ప్రొడక్ట్స్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా పారిస్‌లో జరిగి గ్యాలక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ 2024లో ఫోల్డబుల్ ఫోన్‌తో పాటు స్మార్ట్‌వాచ్, ఇయర్ బడ్స్‌ను లాంచ్ చేసింది. ఇందులో భాగంగానే గ్యాలక్సీ బడ్స్ 3 పేరుతో కొత్త ఇయర్ బడ్స్‌ను తీసుకొచ్చింది. ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Jul 11, 2024 | 9:08 PM

ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్‌సంగ్ మార్కెట్లోకి కొత్త ఇయర్ బడ్స్‌ని లాంచ్ చేసింది. గ్యాలక్స్ బడ్స్ 3పేరుతో అధునాతన ఫీచర్లతో కూడిన ఇయర్ బడ్స్‌ని తాజాగా జరిగిన గ్యాలక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో తీసుకొచ్చింది. ఇందులో భాగంగా బడ్స్ 3, గ్యాలక్సీ బడ్స్ 3 ప్రోలను లాంచ్ చేసింది.

గ్యాలక్సీ బడ్స్ ఇయర్ బడ్స్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను జోడించారు. ఇందులో మెరుగైన 2-వే స్పీకర్ సిస్టమ్‌గా పనిచేసే 'కెనాల్ టైప్' స్టెమ్ డిజైన్‌ను ఇచ్చారు. ఇందులో క్రిస్టల్-క్లియర్ సౌండ్ అనుభూతి కోసం డ్యూయల్ యాంప్లిఫైయర్‌ను ఇన్‌స్టాల్ చేశారు. ఇయర్‌బడ్‌లు IP57 రేటింగ్‌తో తీసుకొచ్చారు.

ఇక గ్యాలక్సీ బడ్స్ 3 బరువు 4.7 గ్రాములుగా ఉంటుంది. బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 48 ఎమ్‌ఏహెచ్‌తో కూడిన బ్యాటరీని అందించారు. అలాగే ఛార్జింగ్ కేస్ బ్యాటరీ సామర్థ్యం 515 ఎమ్‌ఏహెచ్‌గా ఉంటుంది. స్పష్టమైన సౌండ్ క్వాలిటీ కోసం ఇందులో 11ఎమ్‌ఎమ్ డైమనిక్ డ్రైవర్‌లను అందించారు.

వీటితో 360 డిగ్రీస్ ఆడియో సరౌండ్ ఎక్స్‌పీరియన్స్‌ను పొందొచ్చు. ఈ ఇబయ్ బడ్స్‌ను ఒక్కసారి ఛార్జ్ చేసే 24 గంటలపాటు నాన్‌స్టాప్‌గా వినొచ్చని కంపెనీ చెబుతోంది. ఈ ఇయర్ బడ్స్‌ను వైట్, సిల్వర్ కలర్స్‌లో తీసుకొచ్చారు.

ఇక ధర విషయానికొస్తే గ్యాలక్సీ బడ్స్ 3 ధర రూ. 14,999 నుంచి ప్రారంభమవుతుంది. అలాగే గ్యాలక్సీ బడ్స్ 3 ప్రో ధర రూ. 19,999 నుంచి ప్రారంభమవుతుంది. ప్రీ ఆర్డర్స్ ప్రారంభంకాగా జులై 24 నుంచి అమ్మకాలు ప్రారంభంకానున్నాయి.




