Lava: కొత్త ఫోన్‌ కొనే వారికి పండగే.. రూ. 15 వేలలో కర్వ్డ్‌ డిస్‌ప్లేతో పాటు మరెన్నో ఫీచర్స్‌

తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో కూడిన ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి దేశీయ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం లావా అదిరిపోయే న్యూస్‌ చెప్పింది. లావా నుంచి భారత మార్కెట్లోకి అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ అయ్యింది. లావా బ్లేజ్‌ ఎక్స్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో సూపర్‌ ఫీచర్లను అందించారు. ఇంతకీ ఈ ఫోన్‌ ధర ఎంత.? ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

Narender Vaitla

|

Updated on: Jul 11, 2024 | 10:01 PM

భారత్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. చైనాకు కంపెనీలకు ధీటుగా పోటీనిచ్చే క్రమంలో లావా బ్లేజ్‌ ఎక్స్‌ పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. జులై 20వ తేదీ నుంచి అమ్మకాలు ప్రారంభంకానున్నాయి.

1 / 5
లావా బ్లేజ్‌ ఎక్స్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.67 ఇంకచెస్‌తో కూడిన కర్వ్డ్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇచ్చారు. 120 హెజ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌,  1080x2400 రిజల్యూషన్‌, 800 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ఈ స్క్రీన్‌ సొంతం.

2 / 5
ఇక ఈ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ధర విషయానికొస్తే 4జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 14,999, 6 జీబీ ర్యామ్‌ ధర రూ. 15,999కాగా 8 జీబీ ర్యామ్‌ ధర రూ. 16,999గా నిర్ణయించారు. లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా డిస్కౌంట్ లభించే అవకాశాలు ఉన్నాయి.

3 / 5
బ్యాటరీ విషయానికొస్తే ఈ ఫోన్‌లో 33 వాట్స్‌ వైర్డ్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. అలాగే ఇందులో 64 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను ఇచ్చారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 16 మెగాపిక్సెల్స్‌తో పంచ్‌ హోల్‌ ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు.

4 / 5
లావా బ్లేజ్‌ ఎక్స్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్ సిస్టమతో పనిచేస్తుంది. రెండేళ్లపాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను ఉచితంగా పొందొచ్చు. అలాగే ఆండ్రాయిడ్‌ 15కి అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.

5 / 5
Follow us