- Telugu News Photo Gallery Technology photos Oppo reno launches Oppo Reno 12 and oppo reno 12 pro smartphones, Check here for more details
Oppo Reno 12: ఒప్పో నుంచి కొత్త ఫోన్.. అదిరే లుక్, ఆకర్షణీయమైన ఫీచర్స్
ప్రస్తుతం మార్కట్‌లోకి వరుసగా స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ అవుతున్నాయి. ముఖ్యంగా చైనాకు చెందిన సంస్థలు తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో కూడిన ఫోన్‌లను తీసుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. ఒప్పో రెనో 12 పేరుతో కొత్త సిరీస్‌ను లాంచ్ చేస్తోంది. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పడు తెలుసుకుందాం..
Updated on: Jul 12, 2024 | 9:04 PM

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. ఒప్పో రెనో 12 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ ఫోన్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన కొన్ని ఫీచర్లను అందించారు. ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఒప్పో రెనో 12 సిరీస్‌లో భాగంగా రెండు కొత్త ఫోన్‌లను తీసుకొచ్చింది. ఒప్పో రెన్ 12, ఒప్పో రెనో 12 ప్రో పేరుతో 5జీ ఫోన్‌లను లాంచ్ చేశారు. ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఈ రెండు ఫోన్‌లలోనూ 6.67 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ ప్లస్ కర్వ్డ్ ఫ్లెక్సిబుల్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్తేను అందించారు.

ఒప్పో రెనో 12లో స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం గొరిల్లా గ్లాస్ 7ఐని అందించారు. అలాగే రెనో 12 ప్రో ఫోన్‌లో గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌ను తీసుకొచ్చారు. ఈ రెండు ఫోన్‌లు 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉన్నాయి. అలాగే 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెట్ వీటి సొంతం.

ఇక ఈ రెండు ఫోన్‌లు కూడా మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్‌సెట్ ప్రాసెసర్‌తో పనిచేస్తాయి. ఇలాంటే ఇందులో ఏఐ పనితీరును మెరుగుపరిచేందుకు ఇందులో MediaTek APU 655ని జోడించారు.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన సోనీ ఎల్‌వైటీ 600 రెయిర్ కెమెరాను, 50 ఎంపీతో కూడి సెకండరీ కెమెరాను, 8 ఎంపీతో కూడిన వైడ్ యాంగిల్ లెన్స్‌ను ఇచ్చారు. ఇక 12 ప్రో విషయానికొస్తే ఇందులో 50MP సోనీ LYT-600 ప్రైమరీ + 50MP+8MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఇచ్చారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం రెండు ఫోన్స్‌లోనూ 32 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించనున్నారు.




