- Telugu News Photo Gallery Technology photos Steps to find your lost android smartphone and erase data remotely
Find Your Smart Phone: మీ స్మార్ట్ ఫోన్ పోయిందా..? అయితే ఉన్న చోటు నుంచే డేటాను ఇలా డిలీట్ చేయండి.
Steps For Find Your Lost Smartphone Erase Data: స్మార్ట్ ఫోన్‌ను ఎక్కడైనా చేజార్చుకుంటే చాలా మంది వ్యక్తిగత సమాచారం ఎక్కడ లీక్ అవుతుందో అని ఆందోళన చెందుతుంటారు. అలా కాకుండా మీరు ఉన్న చోట నుంచే మీ పోయిన మీ ఫోన్‌లోని డేటాను డిలీట్ చేస్తే బాగుంటుంది కదూ..
Updated on: Mar 15, 2021 | 12:56 AM

స్మార్ట్ ఫోన్‌ను ఎక్కడైనా చేజార్చుకుంటే ముందుగా అందరూ ఆందోళన చెందేది వ్యక్తిగత సమాచారం బహిర్గతమవుతుందని.

బ్యాంక్ సమాచారం నుంచి వ్యక్తిగత ఫొటోల వరకూ ఇలా ఎంతో పర్సనల్ డేటా మొబైల్ ఫోన్‌లో ఉంటుంది.

అయితే పోయిన మీ స్మోర్ట్‌ఫోన్‌లోని డేటాను ఆన్‌లైన్‌లోనే డిలీట్ చేసుకునే అవకాశం ఉందని మీకు తెలుసా?

ఇందు కోసం ముందుగా android.com/find వెబ్‌సైట్‌లోకి వెళ్లి మెయిల్ ఐడీతో లాగిన్ అవ్వాలి. ఫోన్‌లో ఉన్న మెయిల్ ఐడీతో లాగిన్ కావాలి. వెంటనే స్క్రీన్‌పైన మీ స్మార్ట్ ఫోన్ కనిపిస్తుంది.

దీంతో గూగుల్ మీ ఫోన్ ఎక్కడ ఉందో అప్రాక్సిమేట్ లొకేషన్‌ను చూపిస్తుంది. ఒకవేళ ఫోన్ లొకేషన్ దగ్గర్లో ఉంటే 'ప్లే సౌండ్' అనే ఆప్షన్ ద్వారా గుర్తించవచ్చు.

అలా కాకుండా ఫోన్ ఎక్కడో తెలియని లొకేషన్‌లో.. ఎవరికైనా దొరికిందని మీరు భావిస్తే... 'ఎరైజ్ డివైజ్' అనే ఆప్షన్ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌లోని డేటాను పూర్తిగా డిలీట్ చేయవచ్చు. అయితే ఇందుకు మీ ఫోన్‌లో నెట్ ఆన్ చేసి ఉండాలి.




